ప‌వ‌న్ ‘ పంజా ‘ సినిమాకు ముందుగా వెంక‌టేష్ సినిమా టైటిల్ పెట్టాల‌నుకున్నారా ?

బాహుబలి లాంటి దేశం మొత్తం మెచ్చిన ప్రతిష్టాత్మక సినిమా తీసిన ఆర్కా మీడియా సంస్థ మరో బ్యానర్ సంఘమిత్ర ఆర్ట్స్ ప్రొడక్షన్ తో కలిపి సంయుక్తంగా తీసిన సినిమా పంజా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2011 డిసెంబర్ లో రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో డిజ‌ప్పాయింట్ చేసింది. సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా చూపించిన దర్శకుడు విష్ణువర్ధన్ కథ‌నాలపై అంతగా ఫోకస్ పెట్టలేదు. ఈ సినిమాలో పవన్ కు జోడిగా సారాజేన్ డ‌యాన్‌, అంజలి లావాణియా నటించారు.

Watch Panjaa | Prime Video

ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుసహిట్లతో దూసుకుపోతున్న కుర్ర హీరో అడ‌వి శేష్ పంజా సినిమాలో ఒక నెగిటివ్ షేడ్ పాత్ర పోషించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆ సినిమాలో బాలీవుడ్ నటుడు జాకీష్రాప్ తనయుడుగా అడవి శేషు నెగటివ్ రోల్ చేశాడు. అయితే ఈ పాత్ర గురించి ముందు ఒకలా చెప్పిన దర్శకుడు ఆ తర్వాత మరోలా తెరకెక్కించాడని.. శేష్‌ తన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు. ఈ సినిమా కోసం దర్శకుడు విష్ణువర్ధన్ ముందుగా ది షాడో అనే టైటిల్ అనుకున్నారట.

ఈ సినిమా షూటింగ్ ముందుగా కోల్‌క‌త్తాలో మొదలవగా వర్కింగ్ టైటిల్ గా షాడో అనుకున్నారు. ఆ తర్వాత ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అంటూ మీడియాకు హింట్లు ఇస్తూ వచ్చారు. సినిమా పూర్తయ్యాక టైటిల్ మారే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. ఆ తర్వాత పవర్, పటేల్, తిలక్, కాళీ అనే మరో నాలుగు టైటిల్స్ కూడా దర్శక నిర్మాతలు పరిశీలించారు. చివరకు ఈ టైటిల్స్ అన్నీ పక్కన పెట్టేసి పంజా టైటిల్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓకే చేయడంతో.. దసరాకు పంజా పేరుతో టైటిల్ అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.

Shadow (2013 film) - Wikipedia

 

ఎందుకో గాని సినిమా సాంగ్స్ సూపర్ హిట్ అయిన పంజా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు. అయితే పవన్ కళ్యాణ్ ను చాలా స్టైలిష్ గా తెరపై ప్రజెంట్ చేయడంలో దర్శకుడు విష్ణువర్ధన్ కు మంచి మార్కులు పడ్డాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ లో డిజాస్టర్ సినిమాల లిస్టులో పంజా చేరింది. ఇక ఈ సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్లు కూడా తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. ఈ సినిమాకు ముందుగా అనుకున్న షాడో పేరుతో విక్టరీ వెంకటేష్ మరో సినిమా చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.