వీరంగం సృష్టించిన హీరోయిన్‌ డింపుల్ హయాతి.. పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ డింపుల్‌ హయతిపై హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. డింపుల్‌ హయతి ఐపీఎస్‌ అధికారి రాహుల్‌ హెగ్డే కారుని పార్కింగ్‌ ప్లేస్‌లో ఢీ కొట్టింది డింపుల్‌ హయతి. అంతటతో ఆగకుండా ఐపీఎస్‌ని కాలుతో తన్నడం కలకలం రేపుతోంది. డింపుల్‌ హయతి.. ఖిలాడీ.. రామబాణం లాంటి సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన ఈమె.. కానీ త‌న‌, రియల్‌ లైఫ్‌లో మ‌త్రం రెచ్చిపోవడం చర్చనీయాంశంగా మారింది.

Ramabanam movie review: రివ్యూ: రామ‌బాణం | rama banam review in telugu

హీరోయిన్ కదా సినిమాల్లోలా ఏం చేసినా చెల్లుతుందనుకుందా ? అని ప‌లువురు సందేహిస‌తున్నారు. ఏకంగా ఐపీఎస్‌ అధికారినే కాలదన్నే స్థాయికి చేరింది ఈ టాలీవుడ్‌ నటి అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఐపీఎస్ అధికారి వాహనాన్ని ఉద్దేశ పూర్వకంగా డింపుల్ ఢీకొట్టడంతో పాటు కారును కాలుతో తనతో అక్కడ నానా వీరంగం సృష్టించింది. ఇదేంటని ప్రశ్నించిన కార్ డ్రైవర్ పై విరుచుకుపడుతూ గొడవకు దిగింది.

Khiladi Movie (Feb 2022) - Trailer, Star Cast, Release Date | Paytm.com

హైదరాబాద్‌లోని జర్నలిస్టు కాలనీలో ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు నటి డింపుల్‌ హయతి. ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌ హెగ్డే. పార్కింగ్‌ ప్లేస్‌లో ఉన్న రాహుల్‌ హెగ్డే వాహనాన్ని ఢీ కొట్టడంతో పాటు కారును కాలుతో తనతో అక్కడ నానా వీరంగం సృష్టించింది. ఇదేంటని ప్రశ్నించిన కార్ డ్రైవర్ పై విరుచుకుపడుతూ గొడవకు దిగింది. ఇదే విషయంపై డింపుల్‌, ఆమె స్నేహితుడు విక్టర్‌ డేవిడ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.