ఆపిల్ బ్యూటీగా సినిమా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. చాలా చిన్న ఏజ్ లోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక ఎంత త్వరగా స్టార్ స్టేటస్ అందుకునిందో అంతే త్వరగా లైఫ్ లో సెటిల్ అయిపోయింది . చాలా చిన్న ఏజ్ లోనే కోట్ల ఆస్తి సంపాదించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న హన్సిక టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా తర్వాత హన్సిక ఎలా టాలీవుడ్లో స్టార్ స్టేటస్ అందుకుందో మనకు తెలిసిందే. ఆ తర్వాత కోలీవుడ్ లో పలు సినిమాలు నటించి కోలీవుడ్ లో ఏకంగా నెంబర్ వన్ హీరోయిన్ స్థానాన్ని అందుకుంది. రీసెంట్ గానే ముంబై బిజినెస్ మ్యాన్ సోహెల్ ఖతూరియాను ప్రేమించు పెళ్లి చేసుకున్న హన్సిక .. ప్రజెంట్ మ్యారేజ్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. అయితే ఇలాంటి క్రమంలోనే హన్సిక కి సంబంధించిన ఓ న్యూస్ ఇంట్రెస్టింగ్గా మారింది.
కోలీవుడ్ స్టార్ లెజెండ్ హీరో రజనీకాంత్ అంటే ఆమెకు చాలా చాలా ఇష్టమని ఆమె ఆయన ఫేవరెట్ హీరో అని హన్సిక ఎన్నో ఇంటర్వ్యూలో బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే గతం లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హన్సిక..” తన బెడ్ రూమ్ నిండా రజినీకాంత్ డిఫరెంట్ స్టైల్ పిక్చర్స్ ఫొటోస్ పోస్టర్స్ ఉంటాయి అంటూ చెప్పుకొచ్చింది “. పెళ్ళి ఆతర్వాత కూడా సేమ్ తనకు నచ్చిన విధంగానే బెడ్ రూమ్ ని మొత్తం డెకరేట్ చేసుకుందట . ఆమె బెడ్ రూమ్ లో సోహెల్-హన్సిక పెళ్లి ఫోటో ఒకటి ఉంటే ..దాదాపు 20 కి పైగానే రజనీకాంత్ డిఫరెంట్ స్టిల్స్ ఉన్న పోస్టర్స్ రూమ్ నిండా అంటించేసి ఉంటుందట. ఎవరైనా సరే ఈమె రూమ్ ను చూసిన వాళ్ళు షాక్ అవ్వక తప్పదు అంటున్నారు ఆమె స్నేహితులు . అంతలా ఆయన అంటే ప్రాణం ఇచ్చేస్తుందని.. హన్సిక.. రజనీకాంత్ కి డై హార్ట్ ఫ్యాన్ అని చెప్పుకొస్తున్నారు ఆమె స్నేహితులు..!!