గుప్పెడంత మనసు (ఆగస్టు 10): ఏంజెల్ గతాన్ని బయటపెట్టిన విశ్వనాధం…. ఎస్సై సమాచారంతో రిషి షాక్….!!

ఎపిసోడ్ ప్రారంభంలో డాడ్ ఆ ఫోన్ ఏదో నాకే చేయొచ్చు కదా అంటాడు రిషి. బాధలో ఉన్న వాళ్ళు ఓదార్పుని కోరుకుంటారు. మీకు ఫోన్ చేస్తే మీరు చిరాకు పడతారని నాకు చేసి ఉంటారు వాళ్ళ దృష్టిలో మీరు వేరు నేను వేరు కాదు అంటుంది వసుధార. అయితే డాడీ కి చెప్పండి నా గురించి ఈ కంగారు పడొద్దు అని. ఇక్కడ నన్ను కేర్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అని. వాళ్లు నాకేమీ కానివ్వరని చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతాడు. బయటే మీ కోపం లోపల నా మీద ప్రేమ ఉందని తెలుసు అనుకుంటుంది వసుధార.

దేవయాని ఏంటి నాన్న అంతలా చిరాగ్గా ఉన్నావు ఏమైంది అంటుంది. కొంచెం ఉంటే ఆ రిషిగాడికి దొరికిపోయేవాడిని మళ్లీ మర్డర్ చేపిద్దామని ప్లాన్ చేశాను. నాన్న నువ్వు చేసినవన్నీ కరెక్టే కానీ ఎందుకో మిస్ అవుతున్నాయి అంటుంది దేవయాని. అదే అర్థం కావట్లేదు మామ్ ఏం చేస్తే వాడి అడ్డు తొలగిపోతుందో తెలియడం లేదు అంటాడు రిషి వాళ్ళ అన్నయ్య. ఇప్పుడు నువ్వు ఏమి చేయకు. ఇప్పుడు ఏం చేసినా నువ్వు నీతో పాటు నేను ఇద్దరం దొరికిపోతాము.

అమ్మ ధరణి నేను పిలుస్తున్నానని చెప్పి మహేంద్రని నా రూమ్ కి రమ్మను అంటాడు దేవయాని భర్త. అదే స‌మ‌యంలో దేవయాని తన కొడుకు మాట్లాడుతూ ఉండగా వాళ్ళ ఆయన వెళుతూ ఉంటాడు. అవును శైలేంద్ర మీ అమ్మ చెప్పినట్టు విను అంటాడు వాళ్ళ నాన్న. ఏంటి డాడ్ వినేది కాలేజీ మీద నిన్ను దృష్టి పెట్టమంటుంది కదా దాని గురించే మాట్లాడుతున్న అంటాడు. అంటే డాడ్ విన్న‌ లేదన్నమాట అనుకుంటాడు మన‌సులో. మీరేం అనుకోకపోతే నేను మళ్ళీ కాలేజ్ విషయంలో ఇన్వాల్వ్ అవుతాను అంటాడు శైలేంద్ర.

సరే శైలేంద్ర ఇన్వాల్వ్ అవ్వు అంటాడు వాళ్ళ నాన్న. శైలేంద్ర వస్తానంటే నేను కూడా రమ్మన్నాను మరి నువ్వు ఏమంటావ్ మహేంద్ర అని వాళ్ళ అన్నయ్య… మీ ఇష్టం అన్నయ్య అని మహేంద్ర అంటాడు. నువ్వు రా చెప్తా సైలెంట్ రా అంటాడు మహేంద్ర ఓకే బాబాయ్ అంటాడు. రిషి పోలీస్ కి ఫోన్ చేసి సార్ వాళ్ళు ఎవరో తెలిసిందా అని అడుగుతాడు. మా టీం మొత్తం చాలా ట్ర‌ప్ చేసిన‌ కానీ ఏ క్లూ దొరకట్లేదు సార్ ఆ ఫోన్ ని ట్రప్ చేస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి సార్ అంటాడు పోలీస్.

ఈ నెంబర్ నుంచి ఆ నెంబర్ కి ఆ నెంబర్ నుంచి ఈ నెంబర్ కి తప్ప మరే నెంబర్ కి కాల్ వెళ్లలేదు సార్ అంటాడు. అయినా ఆ నెంబర్ ఎవరిదో తెలుసుకుంటే అబ్బాయి ఎవరు తెలిసిపోద్ది కదా అంటాడు రిషి. యూసర్ ఆ రెండు నెంబర్లు ఒక వ్యక్తి పేరు మీదే ఉన్నాయి అంటాడు పోలీస్. వాడు చనిపోయి కూడా చాలా కాలం అవుతుంది అంటాడు. విశ్వంకి హార్ట్ ఎటాక్ వస్తుంది ఏంజెల్ రిషి రిషి అని అరుస్తుంది. వసుధార రిషి సార్ వచ్చారా లేదా అని తెలుసుకోవడానికి ఒక స్టూడెంట్ని అడుగుతుంది ఇంకా రాలేదు మేడం సార్ అంటాడు. విశ్వం నీకేమవుతుందో అని నేను చాలా కంగారు పడ్డాను అంటది సంచల. నాకేం కాదమ్మా అంటాడు విశ్వం. విశ్వం రిషిని దగ్గరికి రమ్మంటాడు.

చాలా బాధపడుతూ ఉంటుంది ఏంజెల్. విశ్వానికి ఏమీ కాదు కదా అతను తప్పితే నాకు లోకంలో ఎవరూ లేరు అంటూ ఏడుస్తుంది. కంగారు పడకు నాకు ఏమీ కాదు అని ధైర్యం చెప్తాడు విశ్వనాథం. అయినా ఏడుస్తూ ఉంటుంది ఏంజెల్ ఆమెని ఊరుకోబెట్టే సార్ కి జ్యూస్ తీసుకురా అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు రిషి. ఏంజెల్ వెళ్ళిపోయిన తర్వాత రిషి ని పక్కన కూర్చోబెట్టుకొని ఆమె కథంతా చెప్తాడు విశ్వనాథం. నా కొడుకు కోడలు ఫ్లైట్ ఆక్సిడెంట్ లో చనిపోయిన దగ్గర నుంచి తను నా దగ్గర పెరుగుతుంది. తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను ఒంటరి వాడిని అయిపోతానని పెళ్లి కూడా వాయిదా వేస్తూ వచ్చింది ఇప్పుడు నా బెంగ అంతా తన గురించే అంటాడు విశ్వనాథం.

మీరేమీ కంగారు పడకండి సార్ అని విశ్వనాథానికి ధైర్యం చెప్పి ఏంజెల్ దగ్గరికి వెళ్తాడు. ఏంజెల్ జ్యూస్ కలుపుతూ ఉంటుంది కానీ బాగా ఏడుస్తూ ఉంటుంది. ఆమె దగ్గరికి వచ్చి ధైర్యం చెప్తాడు రిషి.నాకు తాతయ్య తప్పితే ప్రపంచంలో ఎవరూ లేరు. ఆయనకు ఏమైనా అయితే నేను భరించలేను అంటుంది. ఆయనకి వచ్చింది చిన్న ప్రాబ్లం దానికి నువ్వు కంగారు పడక్కర్లేదు అంటాడు రిషి. ఆయనకి వచ్చిన ప్రాబ్లం చిన్నదా పెద్దదో నీకు కూడా తెలుసు కానీ నన్ను సముదాయిస్తున్నావు అంటుంది ఏంజెల్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.