టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది గ్లామరస్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమా హిట్ కావడంతో మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ చాలామంది యువత హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఆ తర్వాత వెంకీ మామ, డిస్కో రాజా, వంటి ఎన్నో సినిమాలో నటించినా ఊహించిన రేంజ్ లో సక్సెస్ రాకపోవడంతో మెల్లగా ఆమెకు అవకాశాలు తగ్గాయి.
సినిమాల్లో అవకాశాలు లేకపోయిన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందాల ఆరబోతతో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాయల్ తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఆసక్తికర పోస్టును షేర్ చేసింది. నువ్వు ఇంకా సోల్ మేట్ దొరకలేదని బాధపడకు ఎందుకంటే పెళ్లయిన వాళ్లు కూడా చాలామంది సోల్ మేట్ కోసం వెతుకుతున్నారు. అంటూ ఆ నోట్లో రాసుకుంది.
ఇది సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చాలామంది పాయల్‌పై ఫైర్ అవుతున్నారు. భారతీయ పెళ్లి వ్యవస్థను అవమానించినట్లుగా నువ్వు రాసిన వాక్యం ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఇందులో తప్పేమీ లేదు ఈ తరంలో చాలామంది అలానే ఉన్నారు. ఒకరిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మరొకరితో ప్రేమలో పడి మొదటి వారికి డివర్స్ ఇచ్చి వారు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటున్నారు ఆమె చేసిన కామెంట్స్ లో తప్పులేదు అంటూ వెనకేసుకొస్తున్నారు.