తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలో బిఆర్ఎస్,కాంగ్రెస్ బిజెపి ఈ మూడు ప్రధాన పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోతోగెలుపు గుర్రాలతో ఎన్నికల ముందుకు వెళుతున్నారు. కొత్తగా బిజెపి,జనసేన పొత్తు కూడా ఏర్పాటు చేసుకున్నారు. టిడిపి ఈ ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించారు. అలాగే వైయస్సార్ టీపీ అంటూ పార్టీ పెట్టిన షర్మిల కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
టిడిపి ఈసారి తెలంగాణలో పోటీ చేయకపోవడానికి ప్రధాన కారణం టిడిపి అధినేత జైలులో ఉండడమే.ఆ సమయంలో తెలంగాణ నుంచి చంద్రబాబుకు పూర్తి మద్దతు లభించింది.ఆ మద్దతు తో ఈ సారి టిడిపి కొన్ని స్థానాలలో ఖచ్చితంగా విజయం సాధించేదే. కానీ టిడిపి రిస్క్ చేయదలచుకోలేదు. రిస్క్ చేసి ఏదైనా తేడా కొడితే ఏపీ పై ప్రభావం ఉంటుంది. అందుకే పోటీకి దూరం జరిగారు. కానీ తెలంగాణలో కొన్ని స్థానాల్లో గెలుపును శాసించేది ఆంధ్ర సెటిలర్ ఓటర్స్. సెటిలర్స్ అంటే ఒక లక్ష రెండు లక్షల అనుకుంటే పొరపాటే 55 నుంచి 60 లక్షల వరకు సెటిలర్స్ ఓట్లు ఉన్నాయి.
ఈ ఓట్లు ఏ పార్టీకి పడితే ఆ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందనేది వాస్తవం. తెలంగాణలోని సెటిలర్స్ ఓట్లు పొరపాటున కూడా బిజెపికి పడవు. జనసేనకి పడతాయి అనుకుంటే జనసేన బీజేపీ పొత్తులో ఉండటం వల్ల ఆ అవకాశాలు తక్కువే. ఇంకా పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బిఆర్ఎస్. బిఆర్ఎస్ తో రెండేళ్ల నుంచి విసిగి వేసారిన సెటిలర్స్ తో పాటు తెలంగాణ ప్రజానీకం తమ ఓట్లు కాంగ్రెస్ కు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై సెటిలర్స్ కు ప్రత్యేక అభిమానం ఉంటుంది. అంతేకాకుండా తెలంగాణ టిడిపి నాయకులందరూ రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉన్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు అభిమాని కావడంతో తెలంగాణ టిడిపి నాయకులంతా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారని రాజకీయ వర్గాలు అంటున్నారు. బాబు అక్రమ అరెస్టును ఖండించకుండా తెలంగాణలో బిఆర్ఎస్ సెటిలర్స్ ఓట్లను చేజార్చుకుందని చెప్పవచ్చు. జరిగిన విషయం పక్క రాష్ట్రమైన అరెస్టు చేయబడిన నేత జాతీయ హోదా కలిగిన ప్రతిపక్ష నేత కావడం కూడా బిఆర్ఎస్ నేతలు పట్టించుకోలేదు.
ఆ విషయంతో సెటిలర్స్ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పవచ్చు. తెలంగాణలో సెటిలర్స్ ఓట్లతో కీలకంగా ఉన్న నియోజకవర్గాలు మల్కాజి గిరి,ఎల్బీనగర్, కంటోన్మెంట్, కూకట్ పల్లి, ఖమ్మం, సత్తుపల్లి, కరీంనగర్. ఈ నియోజకవర్గాలలో టిడిపి అభిమానులు,టిడిపి నాయకులు,కమ్మ సామాజిక వర్గం నేతలు ఎక్కువగా ఉంటారు. వీరందరూ ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ కి ఓటు వేసి అధికారంలోకి తీసుకురావాలని వీరంతా నిర్ణయించుకున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
కొందరు సెటిలర్స్ అయితే ఇన్నాళ్లు తమ ఓటు ఎక్కడ ఉందో పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆంధ్ర ప్రదేశ్ కి తమ ఓట్లు మార్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కారణం ఈసారి ఆంధ్రప్రదేశ్ లో టిడిపి గెలవాలి. బాబు నాయకత్వం కావాలి అని వీరంతా దృఢంగా కోరుకుంటున్నారు. మరి సెటిలర్స్ ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా ? అనేది కాలమే నిర్ణయించాలి.