‘ డైలీ ఆంధ్రా ‘ ఎక్స్‌క్లూజివ్‌: తాత అవుతోన్న చిరు.. ఉపాస‌న కామినేని డెలివ‌రీ డేట్ ఫిక్స్‌…!

మెగా ఫ్యామిలీలో అప్పుడే సంబరాలు మొద‌లు కానున్నాయి. మెగాస్టార్‌కు వారసుడు రానున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ముద్దుల తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – కొణిదల ఉపాసన దంపతులు ఈనెల రెండో వారంలో తల్లిదండ్రులు కాబోతున్నారు. అలాగే చిరంజీవి తాత కాబోతున్నారు. ఉపాసన – రాంచరణ్ వివాహం జరిగి 10 ఏళ్లు దాటుతోంది. ఇప్పటికే ఎన్నోసార్లు వీరిద్దరూ ఎప్పుడు తల్లిదండ్రులు అవుతారా ? అన్న ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి.

చిరంజీవితో పాటు ఇటు చరణ్‌ దంపతులు కూడా ఈ ప్రశ్నకు సరైన సమయంలో ఆన్సర్ ఇస్తామంటూ దాటా వేసుకుంటూ వస్తున్నారు. ఇక ప్రస్తుతం ఉపాసన గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమెకు 9 నెలలు నిండినట్టు సమాచారం. ఇండస్ట్రీలోని మెగా ఫ్యామిలీతో సంబంధాలు ఉన్న నమ్మకస్తులు చెప్పిన సమాచారం ప్రకారం ఈ నెల రెండో వారంలో సుమారుగా 16 లేదా 17వ తేదీలలో ఉపాసనకు అపోలో హాస్పిటల్ లో ఆపరేషన్ నిర్వహించి ఆమెకు ప్రసవం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇండియాలోనే టాప్ మోస్ట్ పిడ్రియాటిక్ వైద్యులతో పాటు గైనకాలజీ వైద్యులు అందరూ 15వ తేదీ సాయంత్రానికే అపోలోకు చేరుకోనున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ చేయడానికి 24 గంటలు ముందుగానే వైద్యులు అక్కడ అందుబాటులో ఉంటారు. ఆ రెండు రోజులు కనీసం ఆసుపత్రి సిబ్బంది కూడా ఉపాస‌న‌కు ఆప‌రేష‌న్ చేసే వార్డు లోపలకు ఎంటర్ కాకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

రెండు రోజులపాటు మొత్తం ఆ వార్డు పర్యవేక్షణ అంతా టాప్ మోస్ట్ పీట్రియాటిక్ – గైనకాలజిస్ట్‌ల‌ ఆధ్వర్యంలోనే ఉంటుందని తెలిసింది.