దేవ‌ర ఫ్యీజులు ఎగిరే క్లైమాక్స్‌… బ్లాక్‌బ‌స్ట‌ర్ అమ్మ మొగుడే… ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాల‌రెగ‌రేయండ్రా…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా త‌ర్వాత యేడాది పాటు లాంగ్ గ్యాప్ తీసుకుని న‌టిస్తోన్న సినిమా దేవర‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ రెండు షెడ్యూల్స్ కూడా పూర్త‌య్యింది. ఈ సినిమాను ప‌ట్టాలు ఎక్కించేందుకు ద‌ర్శ‌కుడు కొర‌టాల ఆరేడు నెల‌ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ వ‌చ్చి ఎట్ట‌కేల‌కు ఏప్రిల్ చివ‌రి నుంచి స్టార్ట్ చేశాడు.

NTR 30: NTR Jr, Janhvi Kapoor kick off their new film 'NTR 30' with a grand opening ceremony - The Economic Times

హీరోయిన్గా దివంగ‌త అతిలోక అందాల సుంద‌రి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీక‌పూర్ న‌టిస్తోంది. జాన్వీక‌పూర్‌కు సౌత్ ఇండ‌స్ట్రీలోనే కాకుండా.. ఇటు తెలుగులోనూ ఇదే ఫ‌స్ట్ సినిమా. జాన్వీ తెలుగులో ఫ‌స్ట్ ఏ హీరోతో న‌టిస్తుంద‌న్న తీవ్ర ఉత్కంఠ‌కు ఎట్ట‌కేల‌కు ఎన్టీఆర్ – కొర‌టాల తెర‌దించేశారు. అయితే ఈ సినిమా నుంచి వ‌స్తోన్న ఒక్కో అప్‌డేట్ సినిమాపై తీవ్ర ఉత్కంఠ‌తో పాటు అంచ‌నాలు పెంచేస్తోంది.

ఈ క్ర‌మంలోనే హీరోయిన్ జాన్వీక‌పూర్ గురించి ఓ మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. జాన్వీ ఇందులో ఓ అండర్ కవర్ ఆఫీసర్‌గా నటిస్తుందట‌. స‌ముద్రం ఒడ్డున కోస్టల్ ఏరియాలో ఓ డాన్‌ అయిన ఎన్టీఆర్‌పై నిఘా పెట్టేందుకు నేవీ అధికారులు ఆమెను అక్క‌డ‌కు పంపుతార‌ట‌. జాన్వీ అక్క‌డ ఓ జాల‌రి యువ‌తిగా న‌టిస్తూ ఎన్టీఆర్ గుట్టు క‌నుగొనే ప్ర‌య‌త్నాల్లో ఉంటుంద‌ట‌.

అయితే ఆమె క్యారెక్ట‌ర్ రివీల్ అయ్యే ట్విస్టు ప్రి ఇంట‌ర్వెల్ టైంలో వ‌స్తుంద‌ని.. ఈ సీన్ థియేట‌ర్ల‌లో చూస్తుంటే ఫ్యీజులు ఎగిరిపోయేలా ఉంటుంద‌ని మేక‌ర్స్ అప్పుడే లీకులు వ‌దిలేశారు. నిజంగా ఈ సినిమాలో స‌ముద్రంలో వ‌చ్చే యాక్ష‌న్ సీన్లు, ఎన్టీఆర్‌, జాన్వీ పాత్ర‌లు క‌థ‌నం వింటుంటే ఎన్టీఆర్ త‌న ఖాతాలో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ వేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నారు. అప్ప‌టి వ‌ర‌కు ఫ్యాన్స్ క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.