అబ్బాయిలు, అమ్మాయిలు ఏ వ‌య‌స్సులో పెళ్లి చేసుకుంటే మంచిది… ఇద్ద‌రి మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి..!

సాధార‌ణంగా మ‌న పెద్ద‌లు పెళ్లి విష‌యంలో ఏ వ‌య‌సులో జర‌గాల్సిన ముచ్చ‌ట ఆ వ‌య‌సులో జ‌రగాల‌ని అంటూ ఉంటారు. అంటే వారి లెక్క ప్ర‌కారం క‌రెక్టు టైంలో..ఏజ్‌లో పెళ్లి చేసుకోవాలి అని చెప్పేందుకే ఈ సామెత త‌ర‌చూ వాడుతుంటారు. ఇవ్వాల్టికి 30 – 40 ఏళ్ల క్రితం అంత‌కుముందు పెళ్లిళ్ల విష‌యంలో చాలా ఘోర‌మైన నిబంధ‌న‌లు ఉండేవి. ఆడ‌పిల్ల‌లు మెచ్యూర్ అయిన వెంట‌నే పెళ్లి చేసేసేవారు. కొంద‌రు ఆడ‌పిల్ల‌ల‌కు 10 సంవ‌త్స‌రాల వ‌య‌స్సుకు కూడా పెళ్లి చేసేవారు.

అంటే ఆడ‌వాళ్ల‌కు, మ‌గవాళ్ల‌కు మ‌ధ్య వ‌య‌స్సులో చాలా తేడా ఉండేది. అంటే 15, 20, 25 ఏళ్లు వ‌య‌స్సులో త‌మ‌కంటే చిన్నోళ్లు అయిన అమ్మాయిల‌ను కూడా అప్ప‌ట్లో అబ్బాయిలు పెళ్లి చేసుకునేవారు. అయితే ఇప్పుడు ప‌రిస్థితులు పూర్తిగా మారాయి. ఆడ‌పిల్ల‌ల ఆలోచ‌న‌ల్లో పూర్తిగా మార్పు వ‌చ్చింది. అందుకే ఆడ‌, మ‌గ మ‌ధ్య ఇంత ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండ‌డం లేదు.

చిన్న వ‌య‌స్సులోనే అమ్మాయిల‌కు పెళ్లిల్లు చేయ‌డంలో అప్ప‌ట్లో ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌చ్చేవి. ఇప్పుడు అంద‌రూ కెరీర్ మీద కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నారు. లేటు వయసులో పెళ్లిళ్లు కామ‌న్‌. మగవారికి 30 ఏళ్లు దాటిన తర్వాత… ఆడవారికి 25 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లిళ్లు చేస్తున్నారు. అయితే దీని వ‌ల్ల ఇద్ద‌రిలో శృంగార హోర్మ‌న్ల స్థాయి త‌గ్గి శృంగార జీవితం మీద పెద్ద‌గా ఆస‌క్తి ఉండడం లేద‌ని నిపుణులు అధ్య‌య‌నాల్లో చెపుతున్నారు.

 

మ‌గ‌వారికి 22 – 26 ఏళ్ల మ‌ధ్య‌లో పెళ్లి చేయాల‌ట‌. ఆ వ‌య‌స్సులోనే శుక్ర‌క‌ణాల సంఖ్య ఎక్కువుగా ఉండి వెంట‌నే సంతానం క‌ల‌గ‌డంతో పాటు ఆరోగ్య‌క‌ర‌మైన సంతానం జ‌న్మిస్తార‌ట‌. ఇక అమ్మాయిల‌కు క‌రెక్టు వ‌య‌స్సు 18 – 23 అని చెపుతున్నారు. ఇక అమ్మాయిలు 29 ఏళ్ల వరకు గర్భం దాల్చడం ఓకే… 30 ఏళ్లు దాటితే వారికి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో పాటు వారికి పుట్టే బిడ్డల‌కు కూడా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయంటున్నారు. అందుకే ఆడ‌, మ‌గ ఇద్ద‌రూ కూడా స‌రైన వ‌య‌స్సులో పెళ్లి చేసుకుని, పిల్ల‌ల‌ను క‌న‌డం ఉత్త‌మం అని నిపుణులు సూచిస్తున్నారు.