నిహారికపై తప్పుడు కామెంట్.. సాయిధరమ్ తేజ్ స్ట్రాంగ్ వార్నింగ్‌..!

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూల్ అండ్ డీసెంట్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇటీవల ఓ నెటిజ‌న్ కామెంట్‌ సాయి ధరమ్ తేజ్‌కి కోపం తెప్పించడంతో డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. బైక్ యాక్సిడెంట్ తర్వాత కమ్‌ బ్యాక్ ఇచ్చిన తేజ్ విరూపాక్షతో ఓ రేంజ్ లో సక్సెస్ సాధించాడు. త‌ర్వాత‌ పవన్ కళ్యాణ్ తో బ్రో మూవీలో నటించిన ప్రేక్షకులను అలరించాడు. మావయ్య పవన్‌తో బ్రో మూవీ చేసిన తేజ్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశాడు. పవన్ కళ్యాణ్ ని నేను ఒక గురువుగా భావిస్తానని.. ఆయనతో నటించడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానని చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా ఓ మోస్తారుగా ఆడింది. ఇక ఇటీవల సోల్ ఆఫ్‌ సత్య అనే షార్ట్ ఫిలింలో నటించాడు సాయిధరమ్ తేజ్. కలర్ స్వాతి – తేజ్ జంటగా నటించిన ఈ షార్ట్ ఫిల్మ్‌ని నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో సాంగ్ అప్డేట్స్ సాయి ధరమ్ తేజ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసుకున్నాడు. సాయిధరమ్ తేజ్ చేసిన ఆ పోస్ట్ కు చాలా మంది అభిమానులు స్పందించారు. వారితో పాటు నాగబాబు కూతురు నిహారిక సైతం బెస్ట్ ఆఫ్ లక్.. అలాగే ఈ సాంగ్ ఎప్పుడు చూస్తానా అని ఆత్రుత ఉంది అంటూ కామెంట్ చేసింది.

ఓ నెటిజ‌న్ దీనికి స్పందిస్తు నిహారిక వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశిస్తూ ఇలాంటి వాటి మీద ఉన్న కాన్సెంట్రేషన్ ఏదో ఫ్యామిలీ పైన లేకుండా పోయింది అంటూ కామెంట్ చేశాడు. అసలు సందర్భంలో అవసరం లేని కామెంట్ చేసిన ఆ సెటిజ‌న్‌పై సాయి ధరమ్ తేజ్ ఫైర్ అయ్యాడు. దానికి ఘాటుగా స్పందించిన తేజ్ నువ్వు ముందు ఆ కామెంట్ డిలీట్ చెయ్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. నీ పని నువ్వు చూసుకుంటే మంచిది అంటూ సాయి ధరమ్ తేజ్ చేసిన ఆ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో సాయిధరమ్ తేజ్ మంచి పని చేశాడు అంటూ అలాంటి వాళ్లకి ఇలానే బుద్ధి చెప్పాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Sai Dharam Tej (@jetpanja)