అదిరిపోయే అప్డేట్.. స్కందా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి గెస్ట్ గా రాబోతున్న బాలయ్య..

యంగ్ అండ్‌ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ స్కంద ఈ సినిమాలో యంగ్ స్టార్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుంది. శ్రీనివాస్ సిల్వ‌ర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్ లో కనపడబోతున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 15 వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకులు ముందుకి గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్ చేశారు.

ఆగస్టు 26న స్కంద మూవీ ట్రైలర్ రిలీజ్‌ చేయడానికి మేకర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి చీఫ్ గెస్ట్ గా బాలయ్య రాబోతున్నాడట. శిల్పకళా వేదిక లో ఈ ఈవెంట్ జరగబోతుందని సమాచారం. డైరెక్టర్ బోయపాటి – బాలయ్యల మధ్య ఓ ప్రత్యేకమైన బాండింగ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లు తెరకెక్కాయి.

అలాగే హీరో రామ్ కూడా బాలయ్య అంటే ఎంతో అభిమానం ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కి బాలయ్యని పిలిచినట్లు బాలయ్య ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్కంద ఫ్రీ రిలీజ్ ఈవెంట్ బిజినెస్‌లు భారీగా జరిగినట్లు తెలుస్తుంది. ఇక శ్రీ లీల – రామ్ కెమిస్ట్రీ సినిమాలో అదిరిపోనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా నుండి విడుదలైన లింక్స్ వీడియోలో బోయపాటి తన మార్కె డైలాగులతో రామ్‌ని మాస్‌లుక్‌లో చూపించాడు. ఇక ఈ సినిమా రిలీజై ఎటువంటి రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి.