ఇండస్ట్రీలోకి రాకముందు.. నవీన్ పోలిశెట్టి అలాంటి పనులు చేశాడా..!!

జాతి రత్నాలు సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా నవీన్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇక నవీన్ తెలుగు ఇండస్ట్రీలోకి రాకముందు బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అక్కడ హిందీ సినిమాల్లో నటించి ఆ తర్వాత యూట్యూబ్ లో కూడా నటించాడు.

ఇకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల యాక్టర్ గా ట్రై చేస్తూనే పలు పార్ట్ టైం జాబులు కూడా చేశాడట. ఈ విషయాలను తాజాగా నవీన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇక ప్రస్తుతం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తెలుగు ఫేమస్ స్టాండ్ అప్ కమెడియన్ రాజశేఖర్ మామిడిన్న నవీన్ గురించి ఓ రహస్యాన్ని బయటపెట్టాడు. నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో స్టాండప్ కమెడియన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నిజమైన స్టాండప్ కమెడియన్ రాజశేఖర్ ని తీసుకురావడం జరిగింది.

ఈ క్రమంలోనే తెలుగులో కూడా మంచి పేరు సంపాదించుకున్న ఈయన ఇప్పుడు తెలుగులోనే కాకుండా పలు భాషల్లో కూడా కామెడీ షోలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు తాజాగా నవీన్ కోసం హైదరాబాద్ వచ్చి పర్ఫామెన్స్ చేయడం జరిగింది. ఈయన కాసేపు కామెడీ చేసిన తర్వాత నవీన్ గురించి మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ మీ అందరికీ నవీన్ ఒక హీరో గానే తెలుసు.. కానీ నాకు పది సంవత్సరాలు క్రితమే అంటే 2012 నుంచి తెలుసు.

ఒకసారి ముంబైలో బ్లూ క్రాస్ సంస్థలో స్టాండప్ కామెడీ చేయడానికి వెళ్ళగా ఇంకా ఎవరు రాకపోయేసరికి ఎవరైనా స్టాండప్ కామెడీ చేయడానికి వచ్చారా అని అడిగితే.. నవీన్ ను చూపించారు. అప్పుడే మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ముంబై మెట్రోలో తిరుగుతూ మా బాధలన్నీ ఒకరికొకరు చెప్పుకున్నాము. ఆ తర్వాత నేను స్టాండప్ కమెడియన్ అయితే నవీన్ హీరోగా మారిపోయాడు. ఇక్కడ నవీన్ హీరోగా సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉందంటూ రాజశేఖర్ తెలిపాడు. ఇకపోతే హీరో కాకముందు స్టాండప్ కమెడియన్ గా కూడా నవీన్ చేశారని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.