టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఏపీలో ఎక్కడికక్కడ నిరసనలు పెల్లుబింకుతున్నాయి.
చంద్రబాబును ప్రస్తుతం నంద్యాల నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబును అరెస్టు చేయడంతో ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. చంద్రబాబు వద్దకు వెళ్ళకూడదు అంటూ లోకేష్ ను పోలీసులు అడ్డుకోగా అక్కడ హై డ్రామా నెలకొంది. లోకేష్ నోటీసులు అడిగితే డిఎస్పీ వస్తున్నారు అని చెబుతున్న పోలీసులు.. లోకేష్ వద్దకు మీడియా కూడా రాకుండా అడ్డుకుంటున్నారు.
పోలీసుల చర్యను ఖండించిన లోకేష్ నా తండ్రిని చూడడానికి నేను వెళ్ళకూడదా అని పోలీసులను నీలదీయడంతో పోలీసులు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే లోకేష్ తన తండ్రి అరెస్టును ఖండిస్తూ ట్విట్టర్‌లో మెసేజ్ పెట్టారు.
పిచ్చోడు లండన్ కి…మంచోడు జైలుకి…ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం. FIR లో పేరు లేదు..ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు..మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం. నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్ అని లోకేష్ ఘాటుగా స్పందించారు.