ఆ స్టార్ హీరోయిన్‌తో చరణ్ రొమాన్స్… ఉపాసనకు ప‌ట్ట‌రాని కోపం…!

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న జంటలో రామ్ చరణ్- ఉపాసన కూడా ఒకరు. వీళ్లిద్దరు పెళ్లి చేసుకుని దాదాపు 10 ఏళ్ళు దాటింది. పెళ్లయిన మొదటిలో వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారో.. ఇప్పటికీ వీరు అలాగే ఉంటున్నారు. వీరితోపాటు పెళ్లి చేసుకున్న ఎందరో జంటలు మనస్పర్ధలు వచ్చి విడాకులు కూడా తీసుకున్నారు. కానీ రామ్ చరణ్- ఉపాసన మధ్య ఎన్ని గొడవలు వ‌చ్చ‌న‌ వారు ఎప్పుడూ కలిసే ఉంటున్నారు.

వీరి దాంప‌త్య జీవితంపై ఎన్నో పుకార్లు వ‌చ్చాయి. అయితే వీరి అన్యోన్య‌త ముందు అవేమి నిల‌బ‌డ‌లేదు.
ఇక ఇప్పుడు రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు.. ఉపాసన సెప్టెంబర్ లో లేదా ఆగస్టు చీవ‌రిలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఉపాసన ఎప్పుడు తన వ్యక్తిగత విష‌య‌ల‌ను తన అభిమానులతో పంచుకుంటూ వారికి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది.

ఇదే సమయంలో ఉపాసన గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఇంటర్వ్యూలో ఉపాసన- రామ్ చరణ్ హీరోయిన్స్‌ తో రొమాన్స్ చేసే విషయంపై షాకింగ్ విషయాలు బయట పెట్టింది. ఉపాసన మాట్లాడుతూ.. సినిమా హీరో అన్న తర్వాత అన్ని పాత్రల్లో నటించాలి.. సందర్భానుసారంగా రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా నటించాల్సి వస్తుంది.. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడంలో నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు.. కానీ అవసరం లేకపోయినా మితిమీరిన రొమాన్స్ చేస్తే మాత్రం అసలు సహించెను.

Ram Charan-Upasana escape to Africa to celebrate their seventh wedding  anniversary | Events Movie News - Times of India

‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో లో కాజల్ అగర్వాల్- చరణ్ తో రొమాన్స్ చెయ్యడం నాకు కాస్త ఇబ్బంది కలిగించింది. అవసరం లేకపోయినా డైరెక్టర్ ఇలాంటి సన్నివేశాలు ఎందుకు ? పెట్టాడు అంటూ రామ్ చరణ్ తో గొడవ కూడా వేసుకున్నాను. అప్పటి నుంచి చరణ్ రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉంటూ వచ్చాడు’ అని చెప్పుకొచ్చింది ఉపాసన. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్యలు సోష‌ల్ మీడియ‌లో వైరల్‌గా మ‌రాయి.