Ektha Sharma : కరోనా వల్ల ఎంతోమంది జీవితాలు తారుమారయ్యాయి. దాని ఎఫెక్ట్ మాములు మనుషులకే కాదు సెలబ్రిటీస్ ని ఇబ్బంది పెట్టింది. కరోనా ఎఫెక్ట్ తగ్గాక కూడా ఆ ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా బాలీవుడ్ లో బుల్లితెర భామకి కరోనా కష్టాలు తీరలేదు. తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో మునిగిపోవడంతో అమ్మడు కాల్ సెంటర్ లో కూడా ఉద్యోగం చేయాల్సి వచ్చిందని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఉత్తరాధి బుల్లితెర లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఏక్తా శర్మ కరోనా వల్ల ఆర్ధిక ఇబ్బందులు ఎదురవడంతో గడ్డు పరిస్థితుల్లో అవకాశాలు కూడా రాకపోవడంతో కాల్ సెంటర్ లో జాబ్ చేశానని చెప్పింది. అద్దె ఇల్లు అవడంతో అద్దె చెల్లించలేక ఆమె ఇబ్బందులు పడినట్టు చెప్పుకొచ్చింది. కాల్ సెంటర్ లో జాబ్ చేయడం తప్పనిపించలేదని.. అదేమి పెద్ద తప్పని తాను అనుకోవడం లేదని చెప్పారు ఏక్తా శర్మ.
ఎవరైనా సరే ఒకసారి సాయం చేస్తారు.. ఏదో అద్భుతం జరుగుతుందని ఎప్పుడూ తాను ఎదురుచూడలేదని.. అందుకే కష్టపడి పనిచేయాలనే ఉద్దేశంతో కాల్ సెంటర్ లో జాబ్ చేశానని అన్నారు ఏక్తా. హిందీలో ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించిన ఆమె మళ్లీ తిరిగి సీరియల్ ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది. సీరియల్స్ లో మళ్లీ ఆమె బిజీ అవ్వాలని నెటిజెన్లు కోరుతున్నారు.