Kajal Agarwal : స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ తీసుకుంది. ఈమధ్యనే ఓ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ సినిమాలు చేస్తుందా లేదా అన్న అనుమానాలు వచ్చాయి. అయితే ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ కాజల్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టు క్లారిటీ ఇచ్చింది. పెళ్లికి ముందులానే తాను ఇప్పుడు కనిపిస్తూ అలరిస్తుంది. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఫిజిక్ లో మార్పులు వస్తాయి. కానె అవి కనబడకుండా వర్క్ అవుట్స్ చేస్తుంది కాజల్.
ఇక లేటెస్ట్ గా కాజల్ గుర్రపు స్వారీ చేస్తూ కనిపించింది. రీ ఎంట్రీ ప్రయత్నాల్లో భాగంగా ఆమె మళ్లీ అంతా సెట్ రైట్ చేసుకుంటుంది. ప్రస్తుతం కాజల్ గుర్రపు స్వారీ నేర్చుకోవడంలో బిజీ అయ్యింది. ప్రస్తుతం కాజల్ ఇండియన్ 2 సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. ఇదేకాకుండా మరో రెండు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయట.
కాజల్ రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు అయితే పెళ్లైన హీరోయిన్స్ పని అయిపోయినట్టే అని అనుకునేవారు కానీ జెనరేషన్ మారింది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్స్ వరుస సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. ఆడియన్స్ కి దగ్గరయ్యే క్రమంలోనే లేటెస్ట్ గా తన గుర్రపు స్వారీ వీడియో షేర్ చేసింది కాజల్. మరి అమ్మడు తెలుగులో ఏ సినిమాకు సైన్ చేస్తుందో చూడాలి.