అమెరికాలో కరోనా కొత్త వేరియంట్….. భయపడుతున్న ప్రజలు…!

కరోనా ఈ పేరు వింటేనే ప్రతి ఒకరి గుండెల్లో దడ పుడుతుంది. గత మూడేళ్లుగా ప్రపంచాన్ని వనికించిన ఈ వ్యాధి జనాలకి కంటిమీద కునుకు లేకుండా చేసింది. దీంతో ఇప్పుడే ప్రజలు హమ్మయ్య అనుకుంటూ సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఆలోపే మరో ప్రమాదం ముంచుకొస్తుంది. పలు దేశాల్లో కరోనా కొత్త వీరియంట్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.

ఈజీ 5 (EG.5) అనే వీరియంట్ ప్రస్తుతం దేశంలో 17 శాతం కొత్త కరోనా వైరస్ కేసులకు కారణమవుతుందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది. ఈ కొత్త రకం వేరియంట్ ఒమక్రాన్ జాతికి చెందిన ప్రస్తుతమున్న ఎక్స్ బీ 1.9.2(XBB.1.9.2) రికాంబినెంట్ వైరస్ నుంచి పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్స్ బీ 1.9.2 స్ట్రయిన్ తో పోలిస్తే ఇది.5లోని స్పైక్ ప్రోటీన్ లో అదనంగా ఒక మ్యూటేషన్ కలిగి ఉంటదని ఇది 465 స్థానంలో ఉన్నట్లు గుర్తించామని చెప్పారు.

మరోవైపు ఒమిక్ రౌండ్ నుంచి మరో కొత్త వేరియంట్ ” ఈజీ.5.1″గా రూపాంతరం చెంది యూకేలో వేగంగా పనిచేస్తుంది. యూకేలో కరోనా కొత్త వేరియంట్ ఎరిస్ అనే పేరుతో రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటివరకు గుర్తించిన ఏడు కొత్త వేరియంట్లలో ఇది ఒక్కటని యూకే ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు.