నటీనటులు : సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా, సుధీప్ , సాయి మంజ్రేకర్..
నిర్మాతలు : సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, నిఖిల్ ద్వివేది
దర్శకత్వం : ప్రభుదేవా
సినిమాటోగ్రఫీ : మహేష్ లిమాయే
మ్యూజిక్ : సాజిద్ వాజిద్
ఎడిటర్ : రితేష్ సోని
విడుదల తేదీ: 20-12-2019
బాలీవుడ్ కింగ్ ఖాన్ సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ ప్రాంచైజ్ దబంగ్. ఈ సినిమా ఇప్పటికే రెండు పార్టులుగా విడుదలై మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. బాలీవుడ్ బాక్సాఫీసు వీరుడిగా గుర్తింపు ఉన్న కండల వీరుడు సల్మాన్ ఖాన్ దబాంగ్ 3తో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్టార్ డైరెక్టర్, ఇండియన్ మైకేల్ జాక్సన్ గా గుర్తింపు ఉన్న ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు విడుదల అయింది. ఈ సినిమా బాలీవుడ్‌తో పాటుగా సౌత్ ఇండియాలోని పలు భాషల్లో విడుదల అయింది. ఈ సినిమాతో కండలవీరుడు ప్రేక్షకులను ఎలా మెప్పించాడో ఓసారి లుక్కేద్దాం.
కథ: చుల్ బుల్ పాండే(సల్మాన్ ఖాన్) యుక్త వయస్సులో చెడు తిరుగుల్లు తిరుగుతూ ఇదే జీవితం అని బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. కనీసం పెండ్లి చేస్తే ఇంటి పట్టున ఉంటాడు.. కనీసం పనిపాట చేసుకుంటూ చెడు తిరుగుళ్ళు మానుకుంటాడని కుటుంబం భావించి ఖుషీ(సైయీ మంజ్రేకర్)తో పెండ్లి నిశ్చయం చేస్తుంది. అదే సందర్భంలో ఖుషీని చూసిన ఓరౌడీ బలిసింగ్(సుదీప్) ఇష్టపడుతాడు. కానీ ఖుషీ చుల్ బుల్ తో ప్రేమలో ఉందని తెలిసి, ఖుషిని చంపేసి ఆ నేరం చుల్ బుల్ పై నెట్టేస్తాడు. కొన్నాళ్ళు జైలు శిక్ష అనుభవించి బయటకి వచ్చిన చుల్ బుల్ పాండే పోలీస్ అయ్యి బలి సింగ్ ని చంపేస్తాడు. ఆ తర్వాత ప్రాంతాలు మారుతూ పోస్టింగ్ ఎంజాయ్ చేస్తున్న చుల్ బుల్ పాండే కి ఆ ఏరియా డాన్ గా మళ్ళీ బలి సింగ్ ఎదురవుతాడు. చనిపోయిన బలి సింగ్ ఎలా బతికాడు? చుల్ బుల్ పాండే మళ్ళీ ఎదురైన బలి సింగ్ ని ఏం చేసాడు? బలి సింగ్ చుల్ బుల్ పాండేకి ఎలాంటి అడ్డంకులు తెచ్చాడు? వాటిని చుల్ బుల్ ఎలా ఎదుర్కున్నాడు? అనేది తెరపై చూడాల్సిందే.
నటీనటులు : ఈ సినిమాలో కర్త కర్మ క్రియలుగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ , విలన్ కిచ్చ సుదీప్ నిలిచారు. సలీమాన్ ఖాన్ మరోసారి అమితంగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో కామెడీ బాగా పండింది. రోమాన్స్‌లోనూ, యాక్షన్‌లోనూ సినిమా అంతా కామెడీతో నిండిపోయింది. థియోటర్‌కు వెళ్ళిన ప్రేక్షకులు నవ్వుతో పాటే బయటికి వచ్చేంత కామెడీని సినిమాలో చూపారు. ఇక సుధీప్ తన విలనిజంతో సినిమాకు హైలెట్‌గా నిలిచాడు. విలన్ పాత్రలో సుధీప్ ఒదిగిపోయినాడంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఈ సినిమాలో హీరో, విలన్ లు నువ్వా నేనా అంటూ సాగే ఈ సినిమాని వీరిద్దరి పెర్ఫార్మన్స్ లు నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాయి. సోనాక్షి సిన్హా ఎప్పటిలానే సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా కనిపించింది. పాటల్లో కాస్త గ్లామర్ తో కూడా మెప్పించింది. ఇక తొలి పరిచయమైన సైయీ మంజ్రేకర్ ఆన్ స్క్రీన్ బాగుంది. అలాగే సల్మాన్ తో తన కెమిస్ట్రీ కూడా బాగుంది. ఇక సినిమా పరంగా చెప్పుకోవాలంటే.. సినిమా మొదటి నుంచి ఎక్కువ భాగం నవ్విస్తూనే సినిమాని నడిపించడం పెద్ద ప్లస్ అయ్యింది. అలాగే ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ, అందులో వచ్చే షారుఖ్ ఖాన్ కామెడీ ట్రాక్, అలాగే సల్మాన్ ఖాన్ – పనిమనిషి మధ్య వచ్చే ట్రాక్స్ బాగా నవ్విస్తాయి. అలాగే ప్రతి ఫైట్ ని వింటేజ్ స్టైల్లో పూర్తి ఫన్ ఉండేలా చేయడం కూడా బాగా వర్కౌట్ అయ్యింది. కమర్షియల్ గా వన్ ఆన్ వన్ జరిగే క్లైమాక్స్ ఫైట్ డిజైనింగ్ కూడా మాంచి కిక్ ఇస్తుంది. సెకండాఫ్ లో అలీ ఉండేది ఒక్క సీన్ లో చూడా తనదైన మార్క్‌ను చూపించాడు.
సాంకేతిక నిపుణులు : ఈ సినిమాను విజయవంతంగా హాస్యంతో కూడిన యాక్షన్ సినిమాను తయారు చేయడంలో దర్శకుడు ప్రభుదేవా విజయం సాధించారు. కమర్షియల్ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేసేంత రేంజ్‌లో తెరకెక్కించి కిక్ ఇచ్చారు దర్శకుడు. ఇక రాజశ్రీ సుధాకర్ తెలుగు పంచ్ డైలాగ్స్ కూడా ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తాయి. మహేష్ లిమాయే విజువల్స్ కమర్షియల్ సినిమాకి సరిపోయేలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అనల్ అరసు స్టంట్స్ చాలా స్టైలిష్ గా మరియు అంటే ఫన్నీగా కూడా ఉన్నాయి. సాజిద్ వాజిద్ నేపధ్య సంగీతం సినిమాకి బాగానే హెల్ప్ అయ్యింది. మొత్తానికి సాంకేతిక నిపుణులు తమ పరిధి మేరకు సక్సెస్ అయ్యారు.
చివరిగా : కండల వీరుడు తన మ్యానరిజం, నటనతోనూ, కామెడీతోనూ, యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. గత రెండు పార్టులకు సరితూగేలా చిత్రంను తెరకెక్కించడంలో దర్శకుడు ప్రభుదేవా సక్సెస్ అయ్యారు. ఈ సినిమాతో మరోసారి కండల వీరుడు తన ఛరీష్మాను చూపించాడు. మొత్తానికి సల్మాన్ ఖాన్‌కు, ప్రభుదేవాకు, సుధీప్‌కు ఓ మరిచిపోలేని చిత్రం.
రేటింగ్ : 3.0/5