మహేష్ – రాజమౌళి సినిమాకు ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా ..? మోస్ట్ లక్కీయస్ట్ ఫెలో ఇతడే..!

దర్శకధీరుడు రాజమౌళి.. పాన్ ఇండియా సినిమాలతో పాపులర్ అయిన రాజమౌళి ప్రస్తుతం స్టార్ట్ డైరెక్టర్ల‌లో ఒక‌డిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ఇప్పటివరకు ఏ పాన్ ఇండియా సినిమాల్లో నటించ‌క‌పోయినా టాలీవుడ్ లో మహేష్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. చాలామంది అమ్మాయిల మదిలో రాకుమారుడుగా ముద్ర వేసుకున్న మహేష్ కోట్లాదిమంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నాడు.

Oscar predictions: 'RRR' could be top contender - GoldDerby

 

త్వరలోనే మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ ఎవరు..? ఈ సినిమా బడ్జెట్ ఎంత ఉంటుంది..? అనే చ‌ర్చ ఎప్ప‌ట‌కీ పెద్ద‌దే.
అందులోనూ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమాలంటే మినిమం బడ్జెట్ రు. 500కు పైనే ఉంటుందని చాలా మంది అంచ‌నా. రాజమౌళి బాహుబలి సినిమా ద్వారా రు.1800 కోట్ల వసూళ్లు సాధించగా. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా దాదాపు రు. 1250 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.

అసలు విషయానికొస్తే కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాత కేఎల్ నారాయణ ఇచ్చిన అడ్వాన్స్‌ను రాజమౌళి, మహేష్ బాబు తీసుకున్నారట. ఏవో కొన్ని కారణాల చేత ఆ సినిమాలను చేయలేకపోయారు. చాలామంది హీరోలు డైరెక్టర్స్ వారికి ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తారు. కాని మహేష్ బాబు – రాజమౌళి ఇద్దరూ ఇచ్చిన మాట కోసం నిలబడి అడ్వాన్స్ తిరిగి ఇవ్వకుండా కేఎల్‌. నారాయ‌ణ‌కు సినిమా చేయడానికి ఓకే చెప్పారట. అలా ఈ కాంబినేష‌న్ సెట్ అయ్యింది.

SS Rajamouli On His Next With Mahesh Babu: It Will Be A Globetrotting Action Adventure

ఇక ఇప్పుడు రాజ‌మౌళి – మ‌హేస్ కాంబినేష‌న్ అంటే ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా చేయాలంటే రాజమౌళికి కథకు తగ్గట్టుగా ఒక రు. 700 కోట్లయినా ఖర్చవుతుంది. అంత బడ్జెట్ కేఎల్ నారాయణ ఖర్చు పెట్టగలడా..? అంటే సందేహమే. అయితే ఈ ప్రాజెక్టులోకి ఒక‌రిద్ద‌రు పార్ట్‌న‌ర్స్ వ‌చ్చే ఛాన్సులు ఉన్న‌ట్టు తెలుస్తోంది. లేక‌పోతే నారాయ‌ణే స్వ‌యంగా ఫైనాన్స్ తీసుకువ‌స్తాడ‌ని కూడా అంటున్నారు. ఏదేమైనా కేఎల్ నారాయణ మోస్ట్ లక్కీయస్ట్ ఫెలో అనే చెప్పాలి.