నాగార్జునతో అమలకు పెళ్లి జరిపించింది ఎవరో తెలుసా.. ఏఎన్నార్‌కు ఇష్టం లేకుండానే…!

తెలుగు చిత్ర పరిశ్రమంలో అక్కినేని ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి ప్రత్యేకమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన అక్కినేని నాగేశ్వరరావు.. ఆయన తర్వాత వారసుడిగా ఆయన తనయుడు నాగార్జును చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం చేశాడు. నాగార్జున కెరీర్ బిగినింగ్ లో ఎన్నో అవమానాలకు గురయ్యాడు. నాగార్జున‌కు సినిమాలలోకి రాకముందే రామానాయుడు కుమార్తె దగ్గుబాటి లక్ష్మీ తో వివాహమైంది. ఆ తర్వాత విక్రమ్ సినిమాతో తెలుగులో హీరోగా పరిచయమయ్యాడు నాగార్జున.

Kirayi Dada - Telugu Movie Review, Ott, Release Date, Trailer, Budget, Box Office & News - FilmiBeat

మొదట్లో వ‌రుస ప్లాపులు అందుకున్న నాగార్జున తర్వాత గీతాంజలి, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, శివ వంటి సినిమాలతో వరుస విజయాలను అందుకుని తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నాగార్జునకు లక్ష్మికి పెళ్లయిన కొన్ని సంవత్సరాలకే వీరిద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఇక్పటికే వీరికి నాగచైతన్య జన్మించాడు. లక్ష్మితో విడాకులు తీసుకున్న తర్వాత నాగార్జున-అమలతో ప్రేమలో పడ్డాడు.

Watch Siva (1989) (Telugu) Full HD Movie Online on ZEE5

వీరిద్దరూ కిరాయి దాదా అనే సినిమాలో కలిసి జంటగా నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. ఆ తర్వాత శివ సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి జంటగా నటించారు. ఈ సినిమాతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే వీరి పెళ్లికి అక్కినేని నాగేశ్వరరావు ఒప్పుకోకపోవడంతో కిరాయి దాదా సినిమాకి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన దొరస్వామి రాజు వీరి పెళ్లిని దగ్గరుండి తిరుమలలో జరిపించాడు.

Nirnayam - Disney+ Hotstar

పెళ్లి తర్వాత అమల చిత్ర పరిశ్రమకు దూరమైంది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం బిజీగా ఉంది. వీరిద్దరికీ అఖిల్ జన్మించాడు. ప్రస్తుతం అఖిల్ కూడా టాలీవుడ్ లో వరుస‌ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అప్పట్లో వీరి పెళ్లి ఒక సంచలనంగా మారింది.