బిగ్‌షాక్‌: భార్య‌తో శివ‌బాలాజీకి పెద్ద గొడ‌వ‌లు… విడాకులు కూడానా..!

బుల్లితెరపై ఎన్టీఆర్ హోస్టుగా ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షోలో తన ప్రతిభను చూపించి ప్రేక్షకులను మెప్పించాడు శివ బాలాజీ. ఈ షోలో విన్నర్ గా నిలిచిన‌ శివబాలాజీకి క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగింది. అంతకుముందే సిల్వర్ స్క్రీన్ పై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శివ బాలాజీ – మధుమిత జంట. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించడంతో వీరిద్దరి స్నేహం బలపడి ప్రేమగా మారింది త‌ర్వాత‌ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

Siva Balaji (Bigg Boss Telugu 1) Age, Mother, Father, Wife, Movies,  Biography & More

ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరు తమ కుటుంబంతో కలిసి వీరి జీవితం గ‌డుపుతున్నారు. ఇటీవల జరిగిన ఒక బుల్లితెరకు సంబంధించిన షోలో వీరు మాట్లాడుతూ వీరు పెళ్లి విషయంలో వీరు జీవితంలో జరిగిన ఒడిదుడుకులను గురించి చెప్పుకొచ్చారు. నాలుగు సంవత్సరాలు ప్రేమించుకున్న తరువాత జాతకాలు కలవలేదన్న‌ కారణంతో ఒకరికి ఒకరు బ్రేకప్ చెప్పుకున్నారట.

Staying silent will only strengthen trolls, we need to report them: Siva  Balaji | Telugu Movie News - Times of India

మళ్లీ రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ శివ బాలాజీ – మధుమిత దగ్గర అవడం.. పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇంత కష్టపడి వీరు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వీరిద్దరి మధ్యను ఎప్పుడు గొడవలు వస్తూనే ఉండేవట. ఒకసారి వీరిద్దరూ ఇలా గొడవ పడుతూ జీవించడం కంటే విడిపోవడమే బెటర్ అని డెసిషన్ కూడా వచ్చేసారట. శివబాలాజీ తన ఫ్రెండ్స్ తో బయటకి వెళ్లి చాలా టైం త‌ర్వాత‌ తిరిగి వ‌స్తుండ‌డంతో గొడ‌వ‌లు బాగా జ‌రిగేవ‌ట‌.

Celebrity Couple - Siva Balaji <3 Swapna Madhuri <3 | Facebook

గొడ‌వ‌లు పెరిగిపోవ‌డంతో బాబు పుట్టిన తర్వాత కూడా వీరు డివోర్స్ తీసుకోవాలనుకున్నారట.. వీరిద్దరి సన్నిహితులు ఒక వ్యక్తి చెప్పిన సజెషన్ తో ఈ జంట మళ్లీ దగ్గరయ్యారట. వీరిద్ద‌రు కొంత కాలం వేర్వేరుగా ఉండ‌డంతో ఆ ఎడ‌బాటు భ‌రించ‌లేక చివ‌ర‌కు మ‌ళ్లీ క‌లిసిపోయార‌ట‌.