బాల‌య్య పేరుతో ఉన్న సూప‌ర్ హిట్ సాంగ్స్ ఎంటో తెలుసా…!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ నాలుగు ద‌శాబ్దాలుగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. బాల‌కృష్ణ‌ త‌న కెరీర్‌లో ఎన్నో పౌరాణిక‌, సాంఘీక‌, జాన‌ప‌ద‌, చారిత్రాత్మ‌క పాత్ర‌ల‌కు ప్రాణం పోశాడు. అయితే బాల‌కృష్ణ‌ను అభిమానులు ఎంతో ముద్దుగా బాల‌య్య అని పిలుచుకుంటూ ఉంటారు. బంగారు బుల్లోడు సినిమాలో కూడా బాల‌య్య డైలాగ్ చెపుతూ అయిన‌వాళ్లు బాల‌య్య అంటారు… ప‌రాయివాళ్లు బాల‌కృష్ణ అంటారు అని చెప్పిన‌ట్టుగానే బాల‌య్య అనే ప‌దంతో ఓ ఎమోష‌న్‌, ఎ స్లోగ‌న్ అనేది ఉంది.

టాలీవుడ్‌లో బాలకృష్ణ‌ను అభిమానించే వాళ్లంద‌రూ కూడా ముద్దుగా బాల‌య్య అని పిలుస్తూ ఉంటారు. ఈ బాల‌య్య పేరుతో బాల‌కృష్ణ సినిమాల్లో ఎన్నో సాంగ్‌లు వ‌చ్చి సూప‌ర్ హిట్ గా నిలిచాయి. బాల‌కృష్ణ సినిమాల్లో బాల‌య్య పేరుతో వ‌చ్చి సూప‌ర్ హిట్ అయిన సాంగ్స్ ఏంటో ? ఇప్పుడు చూద్దాం.

Bangaru Bullodu (1993 film) - Wikipedia

1- లారీడ్రైవ‌ర్ :
ఈ సినిమాలో బాల‌య్య బాల‌య్య‌.. జ‌య‌మ్మ‌.. జ‌య‌మ్మ సాంగ్ ఓ ఊపు ఊపేసింది. ఇది ఇప్ప‌ట‌కీ ఎవ‌ర్‌గ్రీన్ సాంగ్‌. బాల‌య్య పేరుతో వ‌చ్చిన ఫ‌స్ట్ సాంగ్ ఇదే.
2- బంగారు బుల్లోడు:
త‌కిదినితోం త‌కిదినితోం బాల‌య్యో.. ఇటు రావ‌య్యో సాంగ్ బాగా ఫేమ‌స్‌.
3- న‌ర‌సింహానాయుడు:
ఈ సినిమాలో ల‌క్స్‌పాప సాంగ్‌లో హ‌రేరామ హ‌రేకృష్ణా.. బెండుతీసేయ్ బాల‌కృష్ణా అన్న లైన్ ఉంటుంది.. ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్టో చెప్ప‌క్క‌ర్లేదు.

Seema Simham Telugu Full Hd Movie | Telugu Full Movies | Mana Chitralu - YouTube

4- సీమ‌సింహం:
సీమ‌సింహం సినిమాలో కోకారైకా పాట‌లో చివ‌ర్లో బాల‌య్యో ఏం గోల‌య్యా అన్న లైన్ ఉంటుంది..
5- మ‌హార‌థి:
మ‌హార‌థి సినిమాలో ఒట్టిపెట్టి చెపుతాను సాంగ్‌లో ప‌లుసార్లు కోర‌స్‌లో బాల‌కృష్ణా అని వ‌స్తుంది.
6- మిత్రుడు:
ఈ మూవీ ఫ‌స్ట్ సాంగ్ ప‌ల్ల‌విలో గోపాల‌.. బాల‌కృష్ణా అంటూ వాయించెన్ నా ముర‌ళీ అని కూడా వ‌స్తుంది.

Watch Samarasimha Reddy movie - Starring Balakrishna as Lead Role on ETV Win | Download ETV Win on Play Store

7- అఖండ‌:
అఖండ‌లో యాయా జై బాల‌య్య అన్న సాంగ్ సినిమానే ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్‌తో ప్రేక్ష‌కులు ఫ్యాన్స్ పూన‌కాల‌తో ఊగిపోయారు.
8- వీర‌సింహారెడ్డి:
ఇక వ‌చ్చే సంక్రాంతికి రానున్న వీర‌సింహారెడ్డి సినిమాలో రాజ‌సం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటిపేరు… నీను తాకే దమ్మున్నోడు లేనే లేడ‌య్యా… ఆ మొలతాడు క‌ట్టిన మొగోడు ఇంకా పుట్ట‌నే లేద‌య్యా బాల‌య్యా… అని సాగుతుంది.

బాల‌య్య పేరుతో పాట‌ల్లాగానే న‌ట‌సింహం ఇంటిపేరు నంద‌మూరి పేరుమీద కూడా పాట‌లు వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యాయి.

Narasimha Naidu
9- స‌మ‌ర‌సింహారెడ్డి:
ఈ ఇండ‌స్ట్రీ హిట్ సినిమాలో అంజ‌లా ఝ‌వేరితో నంద‌మూరి నాయ‌కా.. అంద‌మైన కానుకా పెద్ద హిట్ అయ్యింది.
10- గొప్పింటి అల్లుడు:
ఈ సినిమాలో నీ హైటు ఇండియా గేటు సాంగ్‌లో బాల‌య్య సిమ్రాన్‌ను టీజ్ చేస్తాడు. రెండో చ‌ర‌ణంలో నంద‌మూరి వాణ్ణి కురిపిస్తా మార్వ‌లెస్ ప్రేమ అన్న లైన్ ఉంటుంది.

Buy Goppinti Alludu Full Telugu Latest Movie DVD + 1 FREE CD DVD, Blu-ray Online at Best Prices in India | Movies & TV Shows - Amazon.in
11- న‌ర‌సింహానాయుడు :
చిల‌క‌ప‌చ్చ కోకా పాట‌లో చెయ్యేస్తే పుల‌క‌రింత‌లే.. ఈ పిల్ల‌గాడు నంద‌మూరి నాటుబాంబులే అనే లైన్ ఉంటుంది.

ఏదేమైనా బాల‌య్య సినిమాల్లో బాల‌య్య‌, నంద‌మూరి ప‌దాలు ఉంటే సాంగ్ పేలిపోవాల్సిందే. ఇప్పుడు రాబోయే బాల‌య్య 108వ సినిమాలో బాల‌య్య‌పేరు ఓ సూప‌ర్ సాంగ్ రాబోతుంద‌ని తెలుస్తుంది. ఇలా బాల‌య్య పేరు వ‌చ్చిన ప్ర‌తి పాట సూప‌ర్ హిట్‌గా నిలిచింది.