బావ తారకరత్న మరణాని జీర్ణించుకోలేక అలేఖ్య రెడ్డి చెల్లి ఏం చేసిందో తెలుసా.. ఇది లవ్ అంటే..!

నందమూరి హీరోగా పేరు సంపాదించుకున్న నందమూరి రామారావు గారి మనవడు నందమూరి తారకరత్న కొన్ని రోజుల క్రితమే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే . సుదీర్ఘంగా 23 రోజులపాటు మరణంతో పోరాడి అలసిపోయిన తారకరత్న ..మరణంతో గెలవలేక ఓడిపోయి తుది శ్వాస ను విడిచారు . ఈ క్రమంలోనే బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న ఆయన తుదిశ్వాసను విడిచారు . ఈ ఊహించని పరిణామంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబ సభ్యులు ..నందమూరి అభిమానులు శోకసంద్రలో ఉండిపోయారు . కాగా అప్పటివరకు తారకరత్నతో మాట్లాడని తండ్రి మోహన్ కృష్ణ కూడా తారకరత్న అంత్యక్రియలను సాంప్రదాయ బద్దంగా జరిపించి .. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

 

ఈ క్రమంలోనే తారకరత్న భార్య అలేఖ్యరెడ్డిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు . నందమూరి బాలయ్య సైతం అలేఖ్యను ఓదార్చడానికి చాలా ట్రై చేశాడు . కానీ ఆమె తను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన తారకరత్న చనిపోయాడు అన్న బాధ నుంచి ఇంకా బయటపడట్లేదు. తన కూతుర్లను కొడుకులను పట్టుకొని తారకరత్నని గుర్తు చేసుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తున్నారు . తారకరత్న మరణించి ఇన్ని రోజులు అవుతున్న సరే ఇంకా ఆమె తారకరత్న ఫోటో వద్ద విల్సపిస్తూనే ఉంది. దానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి .

Nandamuri Taraka Ratna's Wife Alekhya Reddy Falls Sick; To Be Admitted In A  Hospital? - Filmibeat

 

కాగా రీసెంట్గా బావ తారకరత్న మరణాన్ని జీర్ణించుకోలేక బాధపడుతున్న అక్క అలేఖ్య రెడ్డి కి సపోర్ట్ గా నిలిచింది.. అలేఖ్య రెడ్డి చెల్లి . నిజానికి అలేఖ్య రెడ్డికి సొంత చెల్లెలు ఎవరు లేరు . మనం మాట్లాడుకునేది కజిన్ సిస్టర్. అలేఖ్య రెడ్డి చెల్లెలు అని చెప్పేది ఎవరో కాదు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహా రెడ్డి . అలేఖ్య అలేఖ్య – నేహా రెడ్డి సొంత అక్క చెల్లెలు కాదు .కానీ సొంత అక్క చెల్లెల కంటే ఎక్కువగా ప్రేమగా ఉంటారు. ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు . మరి ముఖ్యంగా అలేఖ్య ఇంట్లో వాళ్లకి నచ్చకుండా తారకరత్న ని పెళ్లి చేసుకున్న టైంలో నేహా రెడ్డి ప్రతి విషయంలోను సపోర్ట్ చేసిందట .

ఈ క్రమంలోనే ఇద్దరు చాలా క్లోజ్ అయిపోయారు .కాగా నేహారెడ్డి ప్రజెంట్ అలేఖ్య రెడ్డికి ఫైనాన్షియల్ సపోర్ట్ , మోరల్ సపోర్ట్ ఎక్కువగా ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బావ తారకరత్న మరణించిన బాధనుండి అక్క కోలుకోవడానికి అలేఖ్య రెడ్డిని వేరే పనిలో బిజీ చేసే విధంగా నేహా రెడ్డి ప్లాన్ చేస్తుందట . నేహా రెడ్డి ఫార్మా దిగ్గజం అయిన అరవింద ఫార్మాసిటికల్స్ చైర్మన్ కొడుకు రోహిత్ రెడ్డి భార్య. అప్పటివరకు రాజకీయ కుటుంబానికి చెందిన నేహా రెడ్డి.. ఆ తర్వాత వ్యాపార సంస్థలోకి కూడా అడుగు పెట్టింది. ఇప్పుడు అలేఖ్యకు డబ్బులు సపోర్ట్ కన్నా ఎమోషనల్ సపోర్ట్ చాలా అవసరం అని తెలుసుకున్న నేహా రెడ్డి.. అక్క కోసం అక్క పిల్లల్ని చూసుకుంటూ అలేఖ్య రెడ్డికి చాలా హెల్ప్ ఫుల్ గా నిలుస్తుంది . సొంత అక్క చెల్లెలు కాకపోయినప్పటికీ వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఒక తల్లికి పుట్టిన బిడ్డలు లా కలిసి ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, Nandamuri Family, social media, social media post, Star hero, Star Heroine, telugu news, tharaka rathna, Tollywood, trendy news, viral news