బాల‌య్య ‘ న‌ర‌సింహ‌నాయుడు ‘ సినిమా క‌థ నిజంగానే జ‌రిగింది తెలుసా.. ఇంత చ‌రిత్ర ఉందా…!

నంద‌మూరి న‌టసింహం బాల‌కృష్ణ సినిమాల‌లో న‌ర‌సింహ‌నాయుడుకు ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. 2001 సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన ఆ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. బాల‌య్య‌ను టాలీవుడ్ శిఖ‌రాగ్రాన నిల‌బెట్టింది. ఈ సినిమాకు పోటీగా మ‌రో ఇద్ద‌రు అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి న‌టించిన మృగ‌రాజు, విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన దేవీపుత్రుడు సినిమాలు రీలిజ్ అయ్యి ఈ రెండు సినిమాలు న‌ర‌సింహ‌నాయుడు తుఫాన్‌లో కొట్టుకుపోయాయి.

samarasimha reddy - etv cinema - Forum

ఈ సినిమా రీలిజ్ అయ్యి 20 సంవ‌త్స‌రాలు అవుతున్నా.. ఇప్ప‌టికి ఎక్క‌డో ఒక చోట న‌ర‌సింహ‌నాయుడు రికార్డుల‌ ప్ర‌స్తావ‌న వ‌స్తుంటుంది. తెలుగు సినిమా చ‌రిత్ర‌ను దేశ‌వ్యాప్తంగా చాటిన గొప్ప సినిమా న‌ర‌సింహ‌నాయుడు. భార‌త‌దేశ సినీచ‌రిత్ర‌లో 100 కేంద్రాల‌లో 100 రోజులు అడిన తొలి సినిమాగా న‌ర‌సింహ‌నాయుడు రికార్డుల‌కు ఎక్కింది. బాల‌య్య – బి. గోపాల్ కాంబినేష‌న్‌లో 1999లో సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన స‌మ‌రసింహారెడ్డి సూప‌ర్ హిట్ అయింది.

ఆ త‌ర్వాత రెండు సంవ‌త్స‌రాలు త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో న‌ర‌సింహ‌నాయుడు వ‌చ్చింది. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కింది. మేడికొండ వెంక‌ట ముర‌ళీకృష్ణ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ సినిమాకు ప‌రుచూరి బ‌ద్ర‌ర్స్ డైలాగ్స్ రాశారు. ఈ సినిమాకు ప‌రుచూరి బ‌ద్ర‌ర్స్ రాసిన డైలాగ్స్ ఇప్ప‌టికి మాస్ అభిమానుల‌ను ఊపేస్తూ ఉంటాయి. అప్ప‌టిలోనే 105 కేంద్రాల‌లో 100 రోజులు అడిన ఈ సినిమా రూ.30 కోట్లు వ‌సూలు చేసింది.

Samarasimha Reddy - Wikipedia

ఈ సినిమా క‌థ రాయల‌సీమ ఫ్యాక్ష‌న్ ఆధారంగా చిన్ని కృష్ణ రాశార‌ని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈ క‌థ‌కు బీహ‌ర్ రాష్టంలో జ‌రిగిన వాస్త‌వ క‌థ ఆధారం అని చాలా త‌క్కువ మందికి మ‌త్ర‌మే తెలుసు. 30 సంవ‌త్స‌రల క్రితం బీహ‌ర్‌లోని ఓ గ్రామంలో కొంద‌రు మూక‌లు గ్రామంపై దాడి చేయ‌డానికి వ‌చ్చేవాళ్ళ‌ట. వాళ్ళ‌ను ఎదుర్కొనేందుకు గ్రామంలో ఒక సైన్యాన్ని నిర్మించుకున్నార‌ట.

త‌మ గ్రామం కోసం ప్ర‌తి ఇంటి నుంచి ఒక మ‌గ పిల్ల‌వాడిని ఆ సైన్యం కోసం అప్ప‌గించేవార‌ట. అంటే వీరు త‌మ మ‌గ‌పిల్లాడిపై ఆశ‌లు వ‌దులుకొనే ఆ సైన్యానికి అప్ప‌గించేవారు. ఈ లైన్ ఆధారంగా చేసుకుని ర‌చ‌యిత చిన్నికృష్ణ న‌ర‌సింహ‌నాయుడు క‌థ‌ను అల్లుకున్నారు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ దానికి తుదిమెరుగులు దిద్దారు.

Samarasimha Reddy

ఈ సినిమా ప్ర‌భావంతో టాలీవుడ్ లో ఆ త‌ర్వాత ఐదారు సంవ‌త్స‌రాల పాటు ఫ్యాక్ష‌న్ సినిమాలు రాజ్య‌మేలాయి. ఈ సినిమా చూసే చిరంజీవి ఇంద్ర తీశారు. న‌ర‌సింహ‌నాయుడు బాల‌కృష్ణ కేరిర్‌లో మాత్ర‌మే కాకుండా, టాలీవుడ్ హిస్ట‌రీలోనే ప్ర‌త్యేక‌మైన సినిమాగా నిలిచిపోయింది.