దేవదాస్ సినిమాలో నాగేశ్వరరావు నిజంగానే తాగి నటించారా… అంద‌రూ షాక్‌…!

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం హిట్ సినిమాలుగా నిలిచాయి. ఆయన నటించిన సినిమాలలో దేవదాసు సినిమాకు మాత్రం ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో నాగేశ్వరరావు, మహానటి సావిత్రి తమ ప్రాణం పెట్టి నటించారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి కొన్ని దశాబ్దాలు దాటిన దేవదాస్ అనే పేరు వింటే ముందుగా ఏఎన్నారే గుర్తుకు వస్తారు.

Devadasu (1953) - IMDb

బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛ‌టోపాధ్యాయ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా రీమేక్ అయిన ఆ భాషల్లో నటించిన నటీనటులు అక్కినేని స్థాయిలో తాము నటించలేకపోయామని చెప్పారంటే దేవదాసు పాత్రలో ఏఎన్ఆర్ ఏ స్థాయిలో జీవించారో మనం అర్థం చేసుకోవచ్చు.

Devadasu (1953) - IMDb

అయితే ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల్లో అక్కినేని నిజంగానే తాగి నటించారని గతంలో ప‌లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. ఈ సినిమాలోని జగమే మాయ బ్రతుకే మాయ సాంగ్ షూట్ రాత్రి సమయంలో జరిగింది. ఏఎన్నార్ రాత్రివేళలో కడుపునిండా తిని సాంగ్ షూట్ లో పాల్గొనేవారట.

Devadasu (1953) - IMDb

నిద్రకు కళ్ళు మూతలు పడుతున్న అలాంటి సమయంలో కూడా ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేయటంతో అక్కినేని నిజంగానే ఆ సాంగ్లో తాగినట్టు ఎక్స్ప్రెషన్లో ఇవ్వగలిగారట. ఇక దేవదాస్ సినిమాలో భవిష్యత్తులో మళ్లి ఎవరైనా తెరకెక్కించినా అక్కినేని స్థాయిలో మెప్పించడం, ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయడం మాత్రం సులువైన విషయం కాదు.