ఆ టైంలో గోపీచంద్ సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాడా..? ప్రభాస్ కూడా పట్టించుకోలేదా..?

సినిమా ఇండస్ట్రీలో మ్యాంచో హీరో గా గుర్తింపు సంపాదించుకున్న గోపీచంద్ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు “తొలివలపు ” సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోగా ఇంట్రడ్యూస్ అయిన గోపీచంద్ ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటిస్తూ ఇండస్ట్రీలో క్రేజీ స్థానాన్ని సంపాదించుకున్నాడు . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విలన్ గా తనలోని షేడ్స్ ను జనాలకు పరిచయం చేసిన గోపీచంద్ హీరోగా కంటే విలన్ గానే జనాలు ఎక్కువగా ఆదరించారు.. అభిమానించారు. అయితే గోపీచంద్ ఒకానొక టైంలో తాను చేస్తుంది తప్పు అని తన ఇండస్ట్రీలో హీరోగా నిలదుకుకోవాలి అనుకుంటున్నాను అని మళ్లీ విలన్ నుంచి హీరోగా టర్న్ అయి తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు.

gopichand, Rama Banam Trailer: దూకుడు చూపించిన గోపీచంద్.. దూసుకొచ్చిన ' రామబాణం' ట్రైలర్ - gopichand rama banam trailer with family emotions and  action packed - Samayam Telugu

నిజం చెప్పాలంటే గోపీచంద్ కెరీర్ లో హీరోగా హిట్ కొట్టిన సినిమాలు కంటే విలన్ గా నటించి సక్సెస్ అయిన సినిమాలు ఎక్కువగా ఉన్నాయి . కాగా రీసెంట్గా నటించిన రామబాణం సినిమా మే 5న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్ తన గత తాలూకా సినిమాల రిజల్ట్ గురించి ఓపెన్ అప్ అయ్యారు. అంతేకాదు గౌతమ్ నంద సినిమా ఫ్లాప్ అవడం పట్ల చాలా బాధపడ్డాను అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు.

Goutham Nanda telugu | Sun NXT

” ఆ సినిమాలో నెగిటివ్స్ ఉన్నాయి ..అయినా సరే జనాలు యాక్సెప్ట్ చేస్తారని అనుకున్నాను ..కానీ జనాలు ఎందుకో ఆ సినిమాని ఎంకరేజ్ చేయలేదు ..ఆ టైంలో చాలా బాధపడ్డాను.. ఆ తర్వాత తప్పు నాదే అని తెలుసుకొని.. ఆ ఫ్లాప్ నుంచి డిప్రెషన్ నుంచి బయటపడ్డాను ..”అంటూ చెప్పుకొచ్చారు. అయితే అదే టైంలో గౌతమ్ నంద సినిమా ఫ్లాప్ అయినప్పుడు గోపీచంద్ సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే అదంతా ఫేక్ అంటూ అప్పట్లోనే తేల్చేశారు గోపీచంద్ ఫాన్స్ .

Rama Banam': Gopichand's Vicky lands punches aplenty! - Telugu News -  IndiaGlitz.com

అంతేకాదు ప్రభాస్ కి గోపీచంద్ కు మధ్య కూడా కొన్ని ఇష్యూస్ వచ్చాయని .. ప్రభాస్ సినిమాలపరంగా తనకు ఎటువంటి హెల్ప్ చేయట్లేదు అని ..గోపీచంద్ బాధపడ్డాడు అంటూ కూడా వార్తలు వినిపించాయి. అయితే అవి కూడా టోటల్ ఫేక్ అంటూ గోపీచంద్ ఫాన్స్ అప్పుడే క్లారిటీ ఇచ్చేశారు . గోపీచంద్ – ప్రభాస్ మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు అంటూ అన్ స్టాప బుల్ ఎపిసోడ్ తో క్లారిటీ వచ్చేసింది . ప్రజెంట్ రామబాణంపై హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నాడు గోపీచంద్. ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ అందుకుంటాడు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు గోపీచంద్ ఫాన్స్..!!