సుప్రియ – అడవి శేషు మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా… ఇంత చిన్నోడిని భ‌ర్త‌గా చేసుకుంటుందా…!

అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ – అడవి శేష్‌ ఈ జంట పేరు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సుప్రియ – అడవి శేష్‌ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నార‌ని.. పెళ్లి ఫిక్స్ అయింద‌ని ర‌క‌రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సుప్రియ.. ఆ తరువాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది.

Goodachari': Here's an interesting update about the Adivi Sesh starrer | Telugu Movie News - Times of India

కాగా 1997లో ఆహా సినిమాకి ప్రొడ్యూసర్‌గా వ్య‌వ‌హ‌రించింది. 2000లో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ ఇండస్ట్రీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మారింది సుప్రియ. ఇష్టం సినిమా హీరో చరణ్‌ని సుప్రియ పెళ్లి చేసుకుంది. ఆ త‌ర్వాత కొంత కాలానికే అనారోగ్యంతో భర్త చరణ్ మరణించారు. కాగా అడవి శేష్ – సుప్రియ కలిసిన నటించిన గూఢచారి సినిమా ద్వారా వీరిద్దరి మధ్య పరిచయం పెరిగింది. అది కాస్త ప్రేమగా మారింది.

Adivi Seshs photo with rumoured girlfriend Supriya Yarlagadda goes viral

ఇక వీరిద్ద‌రు జూన్ 16న వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని.. సుప్రియ మరోసారి పెళ్ళి పీట‌లెక్క‌బోతుందంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 2002లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి అడుగుపెట్టిన అడవి శేష్‌ 2010లో కర్మ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. 2016లో క్షణం అనే సినిమాలో హీరోగా నటించాడు ఆ తర్వాత అడవి శేష్ వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. కాగా సుప్రియ – అడవి శేషు పెళ్లిని అక్కినేని నాగార్జున దగ్గర ఉండి జరిపిస్తున్నారని సమాచారం.

FIRST REPORT - Goodachari Review - A Not-To-Be-Missed Thr

సుప్రియకు 45 సంవత్సరాలు కాగా… అడవి శేష్ వ‌య‌స్సు 38 సంవత్సరాలు. త‌న‌ కన్నా ఏడు సంవత్సరాలు పెద్దదైన సుప్రియతో అడవి శేషు వివాహం జరపడానికి అడవి శేష్‌ తల్లిదండ్రుల‌కు ఇష్టం లేద‌ని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.