శ‌ర‌త్ బాబు జీవితంలో ఎన్టీఆర్ చెప్పిందే జ‌రిగిందా…?

ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ సినీ రంగాన్ని దుఖంలో ముంచేసి వెళ్లిపోయిన శ‌ర‌త్‌బాబు జీవితంలో అన్న‌గారు ఎన్టీఆర్‌తో అనుబంధం ఉన్న విష‌యం చాలా త‌క్కువ మందికి తెలుసు. పౌరాణిక సినిమాల్లో అన్న‌గారితో క‌లిసి.. శ‌ర‌త్ బాబు న‌టించారు. అయితే.. అన్న‌గారికి ప్ర‌త్యేకంగా ఆయ‌న సిగ‌రెట్లు తెప్పించేవారు. అవి కూడా విదేశీ సిగ‌రెట్లు. అయితే.. ఎవ‌రికి ఎలాంటి అల‌వాటు ఉన్నా.. అన్న‌గారి ముందు జాగ్ర‌త్త ప‌డేవారు.

సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత | Senior Actor Sarath Babu Passes Away Details, Senior Actor Sarath Babu , Actor Sarath Babu Passed Away, Actor Sarath Babu Rip, Tollywood, Actor Sarath Babu No

అన్న‌గారి స‌మ‌కాలికులుగా ఉన్న‌రాజ‌నాల, కాంతారావు వంటి వారు కూడా.. అన్న‌గారి ముందు సిగ‌రెట్ తాగేందుకు.. ఒకింత ఇబ్బందిగా ఉండేవారు. అమ్మో.. అన్న‌గారు స్పాట్‌లో ఉన్నారంటే.. సిగ‌రెట్లు బంద్ అనే మాట వినిపించేది. కానీ, శ‌ర‌త్ బాబు అన్న‌గారితో చ‌నువుగా ఉండేవారు. అన్న‌గారికి సిగ‌రెట్ స్వ‌యంగా త‌న చేతులతో వెలిగించ‌డం చాలా ఇష్టంగా భావించేవారు. అన్న‌గారు కూడా త‌మ్ముడు శ‌ర‌త్ ఉన్నాడా ! అని ఆప్యాయంగా ప‌ల‌క‌రించేవారు.

ఈ బంధం చాలా కాలం కొన‌సాగింది. అన్న‌గారి చొర‌వ‌తోనే హైద‌రాబాద్లో ఇల్లు కొనుగోలు చేసిన శ‌ర‌త్ బాబు.. తాను స్వ‌యంగా రాజ‌కీయాల్లోకి రాక‌పోయినా.. ప‌రోక్షంగా అన్న‌గారిని స‌మ‌ర్థించేవారు. గ‌తంంలో అన్న‌గారికి వ్య‌తిరేకంగా మండ‌లాధీసుడు సినిమా వ‌చ్చింది. ఈ సినిమాలో ఆయ‌న‌కు ఒక పాత్ర వ‌స్తే.. మీరు ఎంత ఇచ్చినా.. నేను చేయ‌ను అని తెగేసి చెప్పారు. అయితే.. అన్న‌గారితో క‌లిసి ఉన్న స‌మ‌యంలో ఎన్టీఆర్ ఆయ‌న‌కు కొన్ని సూచ‌న‌లు చేసేవారు.

Sr NTR birth anniversary: 6 iconic performances by the legendary actor | The Times of India

ముఖ్యంగా ఆరోగ్యానికి సంబందించి అన్న‌గారు ప‌లు హెచ్చ‌రిక‌లు కూడా చేశారు. సిగ‌రెట్లు ఎక్కువ‌గా తాగ‌కూడ‌దు… ఏదో ఒక‌టో రెండో అనేవారు. ఇది ముందు ముందు.. మీ ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తుంది..అ నేవారు కానీ, కుటుంబ కార‌ణాలు.. టెన్ష‌న్ నేప‌థ్యంలో శ‌ర‌త్‌బాబు వీటికి ఎడిక్ట్ అయ్యారు. ఇదే.. ఆయ‌న లంగ్స్ స‌హా.. అనేక అవ‌య‌వాలు దెబ్బ‌తిన‌డానికి కార‌ణ‌మైంద‌ని ఇటీవ‌ల వైద్యులు చెప్ప‌డం గ‌మ‌నార్హం.