ఇప్పుడు టాలీవుడ్‌లో నెంబర్ నిర్మాత ఎవ్వరు అంటే అందరు టక్కున చెప్పే పేరు దిల్ రాజు. దిల్ సినిమాతో నిర్మాతగా మారిన రాజు అదే సినిమానే ఇంటిపేరుగా మారింది. ఇక అప్పటి నుంచి సినిమాలు నిర్మించాలంటే అది దిల్ రాజుకే సాధ్యం.. దిల్ రాజుతో చేసిన సినిమా అంటే తప్పకుండా మాగ్జిమమ్ సినిమా అనే అభిప్రాయం అటు ప్రేక్షకుల్లో.. ఇటు బయ్యర్లు.. సిని పరిశ్రమలో పేరుంది. అలాంటి దిల్ రాజుతో సినిమా చేసేందుకు దర్శకులు.. నిర్మాతలు.. హీరోలు సదా సిద్దంగా ఉంటారు.
అయితే నిత్యం సినిమాలు తీస్తూ విజయవంతమైన నిర్మాతగా పేరు ప్రఖ్యాతులు సాధించిన ఈ నిర్మాతకు మాత్రం ముగ్గురు హీరోలతో సినిమా చేసే అవకాశం రాలేదు. ఆ ముగ్గురు అగ్ర హీరోలే కావడం విశేషం. టాలీవుడ్ లో అందరు హీరోలతో సినిమాలు చేసిన దిల్ రాజు.. ఎందరినో తెలుగు తెరకు పరిచయం చేసిన ఈ నిర్మాతకు ముగ్గురు అగ్రహీరోలతో సినిమాలు చేసే అవకాశం రాలేదు. ఈ ముగ్గురు అగ్ర హీరోలు ఎవ్వరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లతో సినిమాలు చేయలేదు దిల్ రాజు.
అయితే ఇప్పుడు పింక్ రీమేక్ సినిమాతో పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసేందుకు దిల్ రాజు రెడి అయ్యాడు. అంటే ముగ్గురు హీరోల్లో ఒకరు బుక్ అయ్యారు దిల్ రాజుకు. ఇక మిగిలింది ఇద్దరు అగ్ర హీరోలు. ఇక బాలకృష్ణ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ రేసు గుర్రంలా పరుగెడుతున్నాడు. దిల్ రాజు తలుచుకుంటే బాలయ్య ఒకే అనడం తరువాయి. కానీ మెగాస్టార్ తోనే సినిమా అంటేనే దిల్ రాజుకు సాధ్యమా అనేది తేలాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఎక్కువగా తన సొంత నిర్మాణ సంస్థలోనే సినిమాలు చేస్తున్నారు. ఇతర ప్రాజెక్టుల్లో సినిమాలు చేయడం లేదు. మరో రెండేళ్ల వరకు మెగాస్టార్‌తో సినిమా చేసే అవకాశం దిల్ రాజుకు లేనట్లే. మరి మెగాస్టార్‌తో సినిమా చేసే అదృష్టం దిల్ రాజుకు కలుగుతుందో లేదో వేచి చూడాల్సిందే.