నందమూరి బాలకృష్ణ అంటే ఇప్పుడు సిని పరిశ్రమలో హీరోయిన్లు దొరకడం కష్టంగా మారింది. అయితే బాలయ్యతో నటించాలని ఒకప్పుడు వరుసకట్టేవారు హీరోయిన్లు.. కానీ ఇప్పుడు బాలయ్యతో సినిమా చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు హీరోయిన్లు.. బాలయ్యకు సరిజోడిని వెతకాలంటే దర్శకులు నానా తంటాలు పడుతున్న తరుణంలో ఓ భామ మాత్రం బాలయ్య కోసం ఏదైనా చేస్తాను.. ఎంతవరకైనా వస్తాను.. అంటూ స్టేట్‌మెంట్ ఇస్తుంది ఈ భామ. ఇప్పటికే బాలయ్యతో సినిమాల మీద సినిమాలు చేస్తున్న ఈభామ ఇప్పుడు కూడా నటిందుకు సిద్దమే అంటుంది.
బాలయ్య కోసం దర్శకులు హీరోయిన్లను ఎంపిక చేయడం గగనంగా మారింది. అయితే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు రెడి అయింది ఈ భామ. ఇంతకు ఈ భామ ఎవ్వరు అనుకుంటున్నారా.. ఆమే రూలర్ సినిమాలో బాలయ్యతో ఆడిపాడబోతున్న తార సోనాల్ చౌహాన్. ఈ అందాల భామ బాలయ్యతో ఎన్ని సినిమాల్లోనైనా నటించేందుకు రెడిగా ఉంటానని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది. బాలయ్య గురించి ఆమె చెప్పిన మాటలు వింటే అందరు షాక్‌కు గురి కావాల్సిందే.
సోనాల్ చౌహాన్ బాలయ్యను పొగడ్తలతో ముంచెత్తింది సోనాల్. బాలకృష్ణ గురించి ముందుగా విని నేను నటించాలంటేనే భయపడ్డానని..కానీ ఆయనతో ఒకసారి నటిస్తే ఆపోహలన్ని తొలిగిపోతాయని అన్నారు. బాలయ్య ఎంతో సరదా మనిషి అని.. తాను మూడు సినిమాల్లో ఆయనతో కలిసి నటించిన అనుభవంతో చెపుతున్నానని ఆమె చెప్పడం ఇప్పుడు టాలీవుడ్‌లో సంచలనం రేపుతుంది. బాలయ్యతో తాను వంద సినిమాల్లో నటించేందుకైనా సిద్దమేనని ప్రకటించింది.