యంగ్ రెబల్ స్టార్‌గా టాలీవుడ్‌కి పరిచయమై పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన నటుడు ప్రభాస్. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ప్రభాస్ సినిమాల విషయంలో చాలా నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. ఆ తర్వాత సాహో సినిమా ద్వారా ఆశించిన ఫలితం రాబట్టలేక పోయాడు. దీంతో కాస్త నిరాశ చెందిన యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆయన తదుపరి సినిమా జాన్(వర్కింగ్ టైటిల్) పై దృష్టి సారించారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసందే.
జాన్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా కావటంతో షూటింగ్‌కు చాలా సమయం పడుతుందన్న టాక్ వినిపిస్తోంది. కానీ.. ఈ సినిమాకు జాన్ అని ఇంతవరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ చాలామంది ఇదే అని ఫిక్స్ అయ్యారు. ఇదిలా ఉంటే.. ప్రభాస్ జాన్ టైటిల్ ను దిల్ రాజు తన సినిమాకు కావాలని యువి నిర్మాతలను అడుగుతున్నాడట. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా సూపర్ హిట్ అయిన క్లాస్ సినిమా “96”. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఫీల్ గుడ్ కథతో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో శర్వానంద్ హీరోగా సమంత హీరోయిన్ గా దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. తమిళ ఒరిజినల్‌ను డైరెక్ట్ చేసిన సి. ప్రేంకుమార్ తెలుగు వెర్షన్‌నూ రూపొందించనున్నాడు. మొదట్లో సేమ్ టైటిల్ తెలుగులో కూడా పెడదామని అనుకున్నారట.కానీ కథ 1996 లో కాకుండా 2000 వ సంవత్సరంలో జరుగుతుందట. దీంతో ’96’ టైటిల్ సూట్ కాదని..సినిమాలో హీరోయిన్ పేరు జానకి. జాను అని పిలుస్తారు. అందుకే రాజుగారు ‘జాను’ టైటిల్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ టైటిల్‌ను అడుగుతున్నట్టు తెలుస్తోంది.