నయనతార… మూడు పదుల వయసు దాటినా సరే వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తమిళంలో వరుస ఆఫర్లతో ఈ భామ ఫుల్ బిజీ గా ఉంటున్న సంగతి తెలిసిందే. యువ హీరోయిన్లు అంత మంది ఉన్నా సరే ఈ సీనియర్ డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా ఉండటంతో ఈ భామ వరుస సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. దర్శక నిర్మాతలు కూడా అందుకు ఓకే అంటున్నారు. ఆమె కోసం భారీగా పారితోషకం ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్దమవుతున్నారు.
అయితే కొన్ని రోజులుగా ఈ భామకు తెలుగులో ఆఫర్లు తగ్గాయి. ఎప్పుడో మినహా ఆమె కనపడటం లేదు. అసలు దానికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా తెలుగులో స్టార్ హీరోల సరసన చేస్తే తనకు గుర్తింపు ఉండటం లేదనే భావన లో నయన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆమెకు తెలుగులో ఫాన్స్ పెరిగినా సరే ఆమెకు మాత్రం గుర్తింపు రావడం లేదని, తన నటనను గుర్తించడం లేదనే ఆవేదనలో ఆమె ఉందట. అదే తమిళంలో అయితే ప్రయోగాలు చేస్తారు, దానికి తోడు అక్కడ హీరోలతో సమానంగా గుర్తింపు ఉంటుందట.
అది అలా ఉంటే, ఇటీవల ఒక కార్యక్రమం కోసమని నయన్ హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా తనతో సన్నిహితంగా ఉండే ఒక దర్శకుడితో మాట్లాడింది ఈ భామ. తెలుగులో సినిమాలు ఎప్పుడు చేస్తారని అడగగా… బాలకృష్ణ మినహా ఎవరితోనూ తనకు నటించే ఉద్దేశం లేదని, ఆయన మనుషులకు విలువ ఇస్తారని, ఇతర హీరోల దగ్గర దాదాపుగా అది ఉండదు. ఆయన సినిమా షూటింగ్ సమయంలో కష్టాలు, నష్టాలు ఇబ్బందులు అన్నీ తెలుసుకుంటారని నయన్ చెప్పిందట. బాలయ్య అయితే రెమ్యునరేషన్ తక్కువ ఉన్నా సరే చేస్తానని చెప్పిందట.