ఎన్టీఆర్ చనిపోయే ముందు అంత బాధ అనుభవించాడా..? ఏఎన్ఆర్ తో చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..!

అప్పట్లో తెలుగు సినిమా అంటే ఎన్టీఆర్ – ఏఎన్నార్ అనే మాట వాస్తవం. ఎంత మంది నటులున్నా సరే ఈ ఇద్దరికీ అప్పట్లో మంచి గుర్తింపు వచ్చింది. ఎన్టీఆర్ కంటే అక్కినేని ముందు వచ్చినా సరే ఇద్దరూ సినిమా పరిశ్రమలో ఒకే విధంగా ప్రభావం చూపించారు. ఎలాంటి పాత్రలు వేయడానికి అయినా సరే వెనకడుగు వేసే వారు కాదు ఇద్దరూ.. అప్పట్లో వీళ్ళకు పోటీ కూడా ఉండేది కాదు.

ఎన్టీయార్ ను చూసి ఏయన్నార్ తొలిసారి ఏమనుకున్నాడో తెలుసా | Unknown Facts  About Ntr And Anr Details, Akkineni Nageswara Rao, Nandamuri Taraka Rama  Rao, Tollywood Industry, Patalabhairavi Movie, Ntr Anr ...

అలాంటి ఎన్టీఆర్- ఏఎన్ఆర్ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఎన్టీఆర్ కూడా ఏఎన్ఆర్ తో కలిసి సినిమా చేయడానికి ఎంతో ఆసక్తి చూపేవారు. అలాంటి ఈ హీరోల మధ్య గ్యాప్ వచ్చిందని అంటూ ఉంటారు. ఎన్టీఆర్ కావాలనే ఏఎన్ఆర్ ను దూరం పెట్టారు అని కూడా అంటారు. ఇందులో ఎంతవరకు ?నిజముందో ఎవరికీ తెలియదు.

ఎన్టీయార్ ను చూసి ఏయన్నార్ తొలిసారి ఏమనుకున్నాడో తెలుసా | Unknown Facts  About Ntr And Anr Details, Akkineni Nageswara Rao, Nandamuri Taraka Rama  Rao, Tollywood Industry, Patalabhairavi Movie, Ntr Anr ...

అసలు విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్- ఏఎన్ఆర్ గురించి ఎవరికీ తెలియని ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని సీనియర్ రచయిత కృష్ణకుమారి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎన్టీఆర్- ఏఎన్ఆర్ మధ్య చిత్ర పరిశ్రమలో ఉన్న కొందరు వ్యక్తుల వల్లే గ్యాప్ వచ్చిందని.. తర్వాత మళ్ళీ వారు కలిసిపోయారని… ఎన్టీఆర్ విషయాలు తెలుసుకోవడానికి.. ఎన్టీఆర్ తో నటించడానికి ఏఎన్ఆర్ ఎంతో ఆసక్తి చూపే వారని రచయిత కృష్ణకుమారి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Sr Ntr Akkineni Nageswara Rao: 4 సార్లు అడిగిన అక్కినేని ఆ విషయంలో ఎన్టీఆర్  కి ఎందుకు నో చెప్పాడు | why akkineni rejected politics with ntr details,  akkineni, ntr, akkineni nageswara rao, sr ntr ...

అదే సమయంలో రచయిత కృష్ణకుమారి తాను ఏఎన్ఆర్ ఇంట్లో ఉన్న సమయంలో ఎన్టీఆర్ దగ్గరనుంచి ఫోన్ కాల్ వచ్చిందని ఆ సమయంలో ఏఎన్ఆర్ ఎంతో భావోద్వేగానికి గురయ్యార‌ని చెప్పారు. ఏఎన్ఆర్ ఏంటి బ్రదర్ అని అడగగా ఎన్టీఆర్ నేను నిన్ను ఒకసారి చూడాలనుకుంటున్నాను అని నీతో నా మనసులోని మాటలు చాలా చెప్పుకోవాలని ఉంది.. ఒకసారి ఇంటికి వస్తారా అంటూ ఎన్టీఆర్- ఏఎన్ఆర్ ను అడిగారట. ఎన్టీఆర్ మాటలకి ఏఎన్ఆర్ ఎంతో చెల్లించిపోయారని రచయిత కృష్ణకుమారి చెప్పింది.

How Brothers NTR and ANR Turned Rivals With a Rift! | Tupaki English

ఏంటి బ్రదర్ అలా అంటున్నారు ? ఈ మధ్యనే కదా ఇంటికి భోజనానికి వచ్చారు అని ఏఎన్ఆర్ అనగా.. ఎన్టీఆర్ కాదు బ్రదర్ నీతో నా మనసులోని బాధను చెప్పుకోవాలని అనిపిస్తుంది అంటూ ఎన్టీఆర్ అన్నారు. ఏఎన్ఆర్ కూడా తప్పకుండా కలుద్దాం బ్రదర్ అన్నారు. ఇక ఈ విషయాన్ని ఏఎన్ఆర్ తన భార్యతో కూడా చెప్పారట. ఇక ఈ ఫోన్ వచ్చిన మరుసటి రోజే ఎన్టీఆర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అలా ఎన్టీఆర్ చివరగా ఏఎన్ఆర్ తో తన మనసులోని మాటలు చెప్పారని రచయిత కృష్ణకుమారి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.