” లెఫ్ట్ హ్యాండ్ తో కొడితే దవడ పగిలిపొద్ది “.. ఆ హీరోకి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..ఏమైందంటే..?

నట‌సింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అఖండతో మొదలైన బాలయ్య దండయాత్ర వీరసింహారెడ్డి తో మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. ఇటు సినిమాలతోనే కాకుండా బాలయ్య బుల్లితెరపై కూడా ఇప్పటికే ఎన్నో సంచలన రికార్డులు కూడా క్రియేట్ చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమాలో నటిస్తున్నాడు.

NBK 108 First Look Out: Nandamuri Balakrishna's Agressive Beard & Moustached Look Hikes The Interest 'Beyond Imagination'

ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత కూడా బాలయ్య- బోయపాటి శ్రీనుతో మరో భారీ సినిమా చేయబోతున్నాడు. అయితే ఇప్పుడు బాలయ్య గతంలో ఓ సినిమా షూటింగ్లో ఓ యంగ్ హీరో పై చేయి చేసుకున్నట్టు ఓ వార్త వైరల్ గా మారింది. అసలు విషయం ఏమిటంటే బాలయ్య గతంలో ఓ సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమాలో బాలయ్య తో పాటుగా ఓ యంగ్ హీరో నటించాడు.

Is Balayya Promoting Too Much Of Mansion House? - Balakrishna

ఆ యంగ్ హీరో ఎప్పుడు షూటింగ్ కి సరైన సమయానికి వచ్చేవాడు కాదు.. దర్శకుడు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే వాడు కాదు. ఓ రోజు సినిమా షూటింగ్ సమయంలో ఆ యువ హీరో ఆ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ తో కొంత అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ హీరోయిన్ తన బాధను బాలయ్యతో చెప్పుకుంద‌ట‌. ఇక బాలయ్య ఆ హీరో కి ఆ షూటింగ్ సెట్లోనే గట్టి వార్నింగ్ ఇచ్చాడట.

అంతేకాకుండా మరోసారి ఇది రిపీట్ అయితే లెఫ్ట్ హ్యాండ్ తో కొడితే దవడ పగిలిపోద్ది అంటూ గటి వార్నింగ్ కూడా ఇచ్చాడట బాలయ్య. ఈ సినిమా తర్వాత నుంచి ఆ యంగ్ హీరో మరో సినిమాలోనే నటించకుండా చిత్ర పరిశ్రమకు దూరమయ్యాడని తెలుస్తుంది.