ప‌వ‌న్ ‘ అత్తారింటికి దారేది ‘ సినిమా మిస్ అయిన‌ స్టార్ హీరో ఎవ‌రు..!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొన్ని సూపర్ హిట్ సినిమాలు సృష్టించిన ప్రభంజనం అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ సినిమా పేరు ఎత్తితే గతంలో ఆ చిత్రం తాలూకు మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, కొడితే ఇలాంటి హిట్ కొట్టాలి అనుకుంటారు. అలాంటి చిత్రాలలో ఒకటి ‘అత్తారింటికి దారేది’. తెలుగు సినిమా ఇండస్ట్రీకి అప్పట్లో ‘మగధీర’ తప్ప, మిగిలిన ఏ సినిమా కూడా 70 కోట్ల రూపాయిల షేర్ రాబట్టలేదు.

Atharintiki Daaredi - Disney+ Hotstar

 

అలాంటి రోజుల్లో అత్తారింటికి దారేది అనే చిత్రం అతి తేలికగా 75 కోట్ల రూపాయిల షేర్ వసూలు చేసి, ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. అప్పట్లో ఈ సినిమా విడుదలకు ముందే HD ప్రింటు పైరసీ కి గురై ఎలాంటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. రిలీజ్‌కు ముందే సినిమా ఆన్‌లైన్‌లో వ‌చ్చేసింది. ఆ పైరసీ ఎదురుకొని కూడా ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ అయ్యిందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఈ ఇండస్ట్రీ హిట్‌ సినిమాను ముందుగా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కోసం అనుకోలేదట. ఇలాంటి సాఫ్ట్ సినిమాలకు మహేష్ బాబు అయితే కరెక్ట్ గా సూట్ అవుతాడని.. మహేష్ కోసమే ఈ సినిమా కథను రెడీ చేశాడట. అదే సమయంలో పవన్, పూరి జగన్నాథ్ తో చేసిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తర్వాత పవన్ డేట్స్ మొత్తాన్ని త్రివిక్రమ్ కోసం ఇచ్చేశాడు. అదే సమయంలో త్రివిక్రమ్ దగ్గర అత్తారింటికి దారేది సినిమా స్క్రిప్ట్ మినహా మరో కథ లేదు.

Mahesh Babu: When Heroes Get Real - Forbes India

దీంతో అదే స్టోరీని పవన్ కళ్యాణ్‌తో చేసేసాడు త్రివిక్రమ్.. ఇక సినిమా విడుదలయ్యాక ఎలాంటి రికార్డులు సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అత్తారింటికి దారేది రికార్డ్స్ బాహుబలి వచ్చేవరకు ఏ స్టార్ హీరో కూడా బ్రేక్ చేయలేకపోయాడు. అప్పుడు యంగ్ హీరోల‌కు హిట్స్ వచ్చినా కూడా ఆ స్థాయిలో కలెక్షన్లను అందుకోలేకపోయారు.. ఆ సినిమా రికార్డ్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.