బ్రహ్మముడి సీరియల్ (ఆగస్ట్ 8):
రాహుల్ తాగి వచ్చి నీకు బంగారం, వజ్రం, డైమండ్ ఇలా ఏం కావాలో అడుగు నీకేం కావాలంటే అవి ఇస్తాను అంటాడు రాహుల్. స్వప్న నాకేం వద్దు నీ ప్రేమ ఉంటే చాలు అంటుంది. తెల్లారుతుంది రాహుల్ నిద్రలేస్తాడు స్వప్న తన గుండె దగ్గర పడుకుని వెంటనే స్వప్న నెట్టేసి లెగుస్తాడు అంతలోగా స్వప్నకి మేలుకు వచ్చి స్వప్న కూడా లెగుస్తుంది. రాహుల్ ఏం జరిగింది అని స్వప్న అని అడుగుతాడు ఏం జరిగిందో నీకు తెలియదా అని స్వప్న అంటుంది. మనకి సెకండ్ టైం ఫస్ట్ నైట్ జరిగింది అని స్వప్న చెప్పుద్ది. మనం ఇప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని స్వప్న అంటే. రాహుల్ ఎప్పుడు ఇలాగే ఉంటే బిజినెస్ పనులు ఎవరు చూస్తారు అంటూ కోపంగా వెళ్ళిపోతాడు.
స్వప్న ఇప్పుడు నేను నెల తప్పితే ఎంత బాగుంటుంది ఇంట్లో నన్ను ఎవరు ఏమీ అనరు అనుకుంటుంది. రాజ్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు అంతలోగే కావ్య బయటకు బ్యాక్ తగిలించుకొని బయటకు వస్తది. రాజ్ ఎక్కడికి వెళ్తున్నారు మేడం గారు అని అడుగుతాడు. కావ్య మా పుట్టింటికి వెళ్తున్నాను మీ ఇంటి దగ్గర నుంచి ఎటువంటి డబ్బు తీసుకెళ్లడం లేదు కావాలంటే బ్యాక్ చెక్ చేసుకోండి అని కావ్య అంటుంది. నేను నిన్ను దొంగ అని అనలేదు ఎందుకు అడుగుతున్నావు అని అడిగాను అంతే అని రాజు అంటాడు. మా నాన్నగారు షాప్ లో నేను పని చేయాలనుకుంటున్నాను అని చెప్పుద్ది కావ్య.
నీకు అంత అవసరమేంటి మా కంపెనీలో జాబ్ చేయమన్నా కదా ఈ ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత కూడా అక్కడ షాప్ లో పని చేస్తే అందరు ఏమని అనుకుంటారో అంటూ రాజ్. నలుగురు ఏమనుకుంటారనే కదా మీరు ఆలోచించేది నాకేం కాదు మా నాన్నగారికి డబ్బు సర్దుబాటు చేయాలి అని కావ్య అంటుంది. మన కంపెనీలో జాబ్ ఇస్తే వద్దన్నావు కదా మళ్లీ ఇప్పుడు ఎందుకు అంటాడు రాజ్. మీ కంపెనీలో జాబ్ నేను ఎప్పటికీ చేయలేను ఇంటి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకెళ్లకుండా నా కష్టంతోనే మా నాన్న అప్పుని తీరుస్తాను అని కావ్య అంటుంది. ఇది విన్న రాహుల్ ఇదే మంచి ఛాన్స్ అని అవకాశం తీసుకుంటాడు. ఇంతలో కావ్య వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటది.
వాళ్ల నాన్నకి పోయింది అనుకున్న కాంట్రాక్ట్ శ్రీను మళ్ళీ వచ్చి ఈ కాంట్రాక్ట్ మీకే వచ్చింది అని చెప్తాడు. అదేంటి మా కావ్య లేకపోతే ఈ కాంట్రాక్ట్ మాకు ఇవ్వనన్నారు కదా అని కావ్య నాన్న అడుగుతారు. కావ్య వస్తుంది కదా తను నాకు ఫోన్ చేసి ఆ కాంట్రాక్ట్ మాకు ఇవ్వండి నేను చేసి ఇస్తాను అని చెప్పింది అంటాడు శ్రీను. తను చేస్తానన్నా నేను చెయ్యనివ్వను తను ఆ ఇంటి కోడలు అని అంటాడు కావ్య వాళ్ళ నాన్న. అంతలో కావ్య వచ్చి నాన్న ఎందుకు చెయ్యకూడదు అని అంటుంది. నువ్వు దుగ్గురాల వంశ కోడలివి ఇక్కడ ఇలాంటి పనులు చేయకూడదు పుట్టింటికి ఒక అతిధి లాగా రావాలి తప్పితే ఇలా పనిచేయడానికి రాకూడదు అని కావ్య వాళ్ళ నాన్న అంటాడు.
మీరు అతిధి అనుకుంటున్నారు కానీ నేను బంధాలని తెంపేసుకోలేదు ఈ అప్పు అక్క పెళ్ళికాని చేసిన ఆ పెళ్లి నాకే జరిగింది కదా నా పెళ్ళికి జరిగిన అప్పును నేనే తీర్చుకుంటానంటూ కావ్య అంటుంది. శ్రీను గారు మీరు అడ్వాన్స్ ఇవ్వండి అంటే ఇస్తాడు. అడ్వాన్స్ తీసుకున్న తర్వాత కూడా చాలా సేపు కావ్య వాళ్ళ నాన్న ఒప్పుకోడు. కావ్య మాటకు మాట చెప్పి ఒప్పించుకున్నా కూడా కావ్య నాన్న ఒప్పుకోడు అప్పుడు కావ్య అయితే జీవితాంతం మీ గుమ్మం తొక్కను అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంట్లో వాళ్ళందరూ కృష్ణమూర్తిని మందలించటంతో కృష్ణమూర్తి కావ్యని ఆపి సగం చచ్చి ఒప్పుకుంటున్నాను. ఒకవేళ అత్తింట్లో ఏమైనా సమస్య వస్తే అప్పుడు ఈ పని మానేయాలి అంటాడు కృష్ణమూర్తి.
సమస్య ఏమి రాదు.. నేను నా భర్తకి చెప్పే వచ్చాను అని కావ్య చెప్పడంతో ఇంట్లో అందరూ ఆనందపడతారు. మరోవైపు రాజ్ ఇంట్లో అందరూ టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. కావ్య లేకపోవడంతో మహారాణి ఇంకా లెగలేదా అని అడుగుతుంది రుద్రాణి. నా కోడల్ని అలా అంటావా అని గొడవకి దిగుతుంది ధాన్యలక్ష్మి.మీ ఇద్దరూ కాసేపు ఆగండి ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు అని మందలిస్తుంది చిట్టి. అప్పుడే వచ్చిన రాజ్ భార్య పుట్టింటికి వెళ్ళింది అని చెప్పటం ఎలా అని సతమతమవుతూ ఉంటాడు.
అంతలోనే ప్రకాష్ ఏదో మాట్లాడుతుంటే ఇందాక కావ్య నీ దగ్గరికి వచ్చింది కదా బాబాయ్.. పుట్టింటికి వెళ్తున్నాను అని చెప్పింది కదా అని బాబాయ్ మతిమరుపు ని వాడుకుంటాడు రాజ్. నిన్నే అంత పెద్ద గొడవ జరిగింది కదా ఇప్పుడు మళ్ళీ వెళ్లడం అవసరమా.. అయినా చెప్పి వెళ్ళొచ్చు కదా అంటుంది అపర్ణ. తన భర్తకి చెప్పి వెళ్ళింది కదా అయినా ఎందుకు చిన్న విషయాన్ని పెద్ద చేస్తావు అంటూ భార్యని మందలిస్తాడు సుభాష్. సీన్ కట్ చేస్తే కృష్ణమూర్తి ఇంట్లో అందరూ ఆనందంగా బొమ్మలు ప్రిపేర్ చేయడానికి కష్టపడుతూ ఉంటారు. తరువాయి భాగంలో కావ్య మట్టి తొక్కడాన్ని మీడియాలో చూసి రాజ్ ఇంట్లో అందరూ షాక్ అవుతారు. దుగ్గిరాల ఫ్యామిలీకి అసలు మనసే లేదా డబ్బుల కోసం దినసరి కూలీగా మారిన ఆ ఇంటి కోడలు అంటూ మీడియాలో న్యూస్ వస్తుంటే కోపంతో రగిలిపోతాడు రాజ్.