హాట్ యాంకర్ అనసూయ (Anasuya) జబర్దస్త్ నుంచి క్విట్ అయిన విషయం తెలిసిందే. అనసూయ ఈ క్రేజ్ తెచ్చుకోవడానికి జబర్దస్త్ చాలా ఉపయోగపడ్డది. అయితే బయటకు వచ్చిన తర్వాత జబర్దస్త్ లో తాను చాలా అవమానాలు పడ్డా అంటూ అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమెపై నెగటివ్ ట్రోల్స్ చేసేలా చేస్తుంది. జబర్దస్త్ లో తన మీద చాలామంది చాలా రకాలుగా స్కిట్స్ లో ప్రస్థావించారని. తన అందం మీద.. తన ఫ్యామిలీ మీద.. తన మీద చాలా రకాలుగా అవమానించారని అన్నది అనసూయ.
అయితే జబర్దస్త్ లో ఉన్నప్పుడు ఇవేమి పట్టించుకోని అనసూయ (Anasuya) బయటకు వచ్చాక ఇలా అనడం ఆడియెన్స్ కి కోపం తెప్పిస్తుంది. దానితో అనసూయ మీద నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. జబర్దస్త్ ద్వారానే నువ్వు ఇప్పుడు ఈ క్రేజ్ ని అనుభవిస్తున్నావ్ అంటూ కొందరు ఘాటు కామెంట్స్ కూడా పెడుతున్నారు. బుల్లితెర యాంకర్ గా చేస్తూ సినిమాల్లో తన సత్తా చాటుతుంది అనసూయ.
ఏ చిన్ని అవకాశాన్ని కూడా వదలకుండా అమ్మడు చేస్తూ వస్తుంది. ప్రస్తుతం వాంటెడ్ పండుగాడ్ సినిమాలో అనసూయ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ లో అనసూయ అందాలనే హైలెట్ గా చేస్తూ సాంగ్ షూట్ చేశారు.