మహేష్ కారణంగానే విజయ్ దేవరకొండ హీరో అయ్యాడా… ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే..!

టాలీవుడ్ లో పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరోగా తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా దగ్గరనుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. హిట్ ప్లాఫెప్‌లతో సంబంధం లేకుండా విజయ్ క్రేజ్,ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతూ వస్తుంది. ఈరోజు విజయ్ నటించిన ఖుషి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్గా నిర్మించిన ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ దర్శకుడు శివ నిర్మాణ దర్శకత్వం వహించాడు. విజయ్‌కు జంటగా ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించింది. నిన్న విడుద‌లైన ఈ సినిమా తోలి షో నుంచే పాజిటివ్ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ హిట్ అందుకున్నాడు. అయితే ఎప్పుడు ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్ తో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆ స‌మ‌యంలోనే ఖుషి సినిమాతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా వారితో పంచుకున్నాడు.

ఈ క్రమంలోనే ఎవరికీ తెలియని ఓ టాప్ సీక్రెట్ ని కూడా బయట పెట్టాడు. ఇక అసలు విషయం ఏమిటంటే విజయ్ దేవరకొండ హీరో అవ్వడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు కారణమట. ఎస్ మీరు వింటున్నది నిజమే.. ఇదే విషయాన్ని విజయ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. అలా అని విజయ్ హీరోగా ఎదగడానికి మహేష్ సాయం చేశాడు అనుకుంటే పొరపాటే అవుతుంది. నిజం ఏమిటంటే విజయ్ హీరోగా అవ్వాలన్న తపన మహేష్ బాబు కారణంగానే కలిగిందట.

మహేష్ ను సూపర్ స్టార్ గా మార్చిన సినిమా పోకిరి.. అప్పట్లో ఇది ఎంత పెద్ద హిట్‌గా నిలిచిందో అందరికీ కొత్తగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాలోని మహేష్ బాబు ఎంట్రీ సీన్ అంటే విజయ్ దేవరకొండకు ఎంతో ఇష్టమట. పోకిరి సినిమాలో మహేష్ ఎంట్రీ సీన్ చూసిన టైంలోనే తను కూడా హీరో అవ్వాలని డిసైడ్ అయ్యాడట.. అసలైన హీరోయిజం అంటే ఇది అనిపించిందని అందుకే ఆ నిమిషం హీరో అవ్వాలని నిర్ణయించుకున్నాను అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తనకు అవకాశం వస్తే అదే సన్నివేశాన్ని రీ క్రియేట్ చేస్తానని కూడా చెప్పుకొచ్చాడు. మరి విజయ్ కోరిక రాబోయే రోజుల్లో నెరవేరుతుందో లేదో చూడాలి.