నటరత్న నందమూరి తారక రామారావు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన హరికృష్ణ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు. ఆయన కెరీర్ లో మొత్తం మీద 14 సినిమాల్లో నటించారు. వాటిలో సగానికి పైగా సినిమాలు మంచి విజయం సాధించాయి. అయితే ఇక్కడ హరికృష్ణ సినిమాలో నటిస్తే ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవుతుందని దర్శకులు బాగా నమ్మేవారు.
అయితే హరికృష్ణ కెరీర్ లో ఇద్దరు దర్శకులు మాత్రం ముచ్చటగా మూడు సినిమాలు చేసి హ్యాట్రిక్ విజయాలు ఇచ్చారు. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు ఇక్కడ చూద్దాం. ముందుగా హరికృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన తెల్లా పెళ్ళామా, తాతమ్మకాల, దాన వీర శూర కర్ణ సినిమాల్లో నటించి మంచి విజయం సాధించారు. ఈ సినిమాల తర్వాత హరికృష్ణకు మంచి విజయాలు ఇచ్చిన దర్శకుడు వైవిఎస్ చౌదరి.. ముందు వరుసలో ఉంటారు.
చౌదరి విషయానికి వస్తే హరికృష్ణ లోని నటుడిని సరిగా వాడుకొని ఆయనకు మూడు గుర్తుండిపోయే సూపర్ విజయాలు ఇచ్చారు. వీరి కాంబోలో తొలి సినిమా సీతారామరాజ.. 1990లో వచ్చింది.. ఈ సినిమాలో నాగార్జున కూడా హరికృష్ణ తమ్ముడుగా నటించాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. తరవాత 2002లో లాహిరి లాహిరిలో సినిమాతో మరోసారి ఈ కాంబో రిపీట్ అయి మళ్ళీ సూపర్ హిట్ అయింది.
ఇక వీరి కాంబోలో వచ్చిన మూడో సినిమా సీతయ్య. ఇది కూడా మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకునీ సెన్సేషన్ హిట్ గా నిలిచింది. ఈ విధంగా హరికృష్ణ కెరీర్లో తండ్రి ఎన్టీఆర్, వైవియాస్ చౌదరి అయినకు మర్చిపోలేని సినిమాలు ఇచ్చారు. ఈరోజు హరికృష్ణ జన్మదినం సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.