తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ ను ఏలుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..!?

పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని ఎవరో గుర్తుపట్టారా..? ఇక ఈమె ముందుగా మన టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది.. అతి తక్కువ కాలంలోనే బిగ్గెస్ట్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ఇలా బాలీవుడ్ లో ఉన్న అందరి అగ్ర హీరోలతో జంటగా నటించిన ఏకైక హీరోయిన్‌గా రికార్డు సృష్టించింది.

ఈమెకి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. ఈమె పేరు వెంటనే పిచ్చెక్కిపోతారు.. రీసెంట్ గానే ఓ యంగ్ హీరోని ప్రేమించి పెళ్లాడి తన ఫ్యామిలీ లైఫ్ లో సంతోషంగా గడుపుతుంది. ఇన్ని క్లూలు ఇచ్చిన ఆ చిన్నారి ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారా..?
ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు కత్రినా కైఫ్.. ఇప్పుడే కాదు చిన్నతనం లో కూడా ఈమె ఎంతో క్యూట్గా అందంగా ఉండేది.

ఈ ముద్దుగుమ్మ తెలుగులో వెంకటేష్ తో కలిసి మల్లీశ్వరి మూవీలో నటించింది. అలాగే బాలయ్యతో అల్లరి పిడుగు సినిమాల్లో కూడా హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో వ‌రుస‌ సినిమాలతో బిజీ అవ్వడంతో తెలుగు సినిమాల వైపు ఈమె చూడలేదు. ఇక కత్రినా తన తొలి తెలుగు సినిమా మల్లీశ్వరి కి ఆ రోజుల్లోనే కోటి రూపాయల రెమ్యూనిరేషన్ తీసుకుందట. ఇది అప్పట్లోనే ఓ సెన్సేషన్ న్యూస్ గా మారింది.

ఇక రీసెంట్ గానే ఈమె విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లాడుంది. అంతకుముందు ఈమె సల్మాన్, రణబీర్ కపూర్ వంటి వారితో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు కూడా బయటికి వచ్చిన విషయం తెలిసిందే. వారిద్దరితో ప్రేమాయణం నడిపిన విషయం నిజమే కానీ, చివరికి విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈమె సల్మాన్ ఖాన్ టైగర్3 సినిమాలో నటిస్తుంది. ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల‌ ముందుకు రానుంది. మరి ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.