Detective David : డిటెక్టివ్ డేవిడ్ చాప్టర్ 1 ట్రైలర్ టాక్..!

యువ దర్శకుడు జావీన్ పాషా డైరక్షన్ లో తేజ క్రియేషన్స్ బ్యానర్ లో నాగేశ్వర రావు నిర్మిస్తున్న సినిమా డిటెక్టివ్ డేవిడ్ (Detective David). రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా చాప్టర్ 1 ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. డిటెక్టివ్ డేవిడ్ చాప్టర్ 1 ట్రైలర్ గురువారం తెలంగాణా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేత రిలీజ్ చేయించారు. ట్రైలర్ చూసిన ఆయన చిత్రయూనిట్ ని అభినందించారు.

సూర్య భరత్ చంద్ర లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా సస్పెన్స్ జానర్ లో తెరకెక్కింది. ఇక రిలీజైన ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా ఆడియన్స్ ని థ్రిల్ అయ్యేలా చేసే ట్విస్టులు, సస్పెన్స్ లు ఉన్నాయని తెలుస్తుంది. సినిమా ట్రైలర్ లో కెమెరా మెన్ వెంకట్ ప్రవీణ్ పనితనం బాగుంది. మొదటి సినిమానే అయినా డైరక్టర్ జవీద్ పాషా చాలా క్లవర్ గా తన టేకింగ్ చూపించారని చెప్పొచ్చు.

Detective David (DD1) చాప్టర్ 1 ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ట్రైలర్ శాంపిల్ మాత్రమే అసలు బొమ్మ సినిమాలో ఉంటుందని అంటున్నారు చిత్రయూనిట్. మరి డిటెక్టివ్ డేవిడ్ చాప్టర్ 1 ట్రైలర్ అయితే ఆసక్తికరంగా ఉండగా సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది చూడాలి.

Tags: DD Chapter 1, DD Trailer, Detective David, Detective David Chapter 1, Tollywood