అది చూపించటం కోసమే దీపికా రెమ్యునరేషన్ పెంచేసిందట..

Deepika-Padukone-Pathan

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఓ సూపర్ సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. వరుస సినిమాలు చేస్తున్నా షారుఖ్ కి సరైన సక్సెస్ దొరకడం లేదు. అందుకే ప్రస్తుతం సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అందులో భాగంగానే పఠాన్, జవాన్ సినిమాలు చేస్తున్నాడు. పఠాన్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు షారుఖ్. ఈ మూవీలో తన లక్కీ ఛార్మ్ దీపికా పదుకొణెతో ( Deepika Padukone ) కలిసి నటిస్తున్నాడు. ఇప్పటికే వీళ్లిద్దరు ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. మరోసారి తమ మ్యాజికల్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు షారుఖ్-దీపిక.
Deepika-Padukone-Pathan

ఈ మూవీ నుంచి తాజాగా ‘బేషరమ్‌ రంగ్‌’ సాంగ్‌ రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఎక్కడ చూసినా ఈ సాంగ్ దే హవా. షారుఖ్‌ ఖాన్‌, దీపిక పదుకొణె కీలక పాత్రల్లో సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పఠాన్‌’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ‘బేషరమ్‌ రంగ్‌’ అంటూ సాగే రొమాంటిక్‌ సాంగ్‌ను విడుదల చేసింది.

ఈ పాటలోదీపిక అందాలు, షారుఖ్‌ స్టైల్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. స్విమ్మింగ్‌పూల్‌ వద్ద పసుపు రంగు బికినీలో దీపిక పదుకొణె డ్యాన్స్‌ చేస్తుంటే యువత మతిపోతోంది. ఈ సాంగ్ విడుదలైన తర్వాత గానీ తెలియలేదు దీపిక ఈ రేంజ్ లో షాక్ ఇస్తుందని. గతంలో కూడా బికినీలో ఆమె కనిపించింది. కానీ ఇంత ఘాటుగా అయితే కనిపించలేదు. బికినీ సైజును ఇంకాస్త తగ్గించేసి అమ్మడు ఊహించని విధంగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. దానికి తోడు షారుక్ ఖాన్ తో ఆమె వేసిన రొమాంటిక్ స్టెప్పులు కూడా మైండ్ బ్లోయింగ్ అనేలా ఉన్నాయి.
Deepika-Padukone-Pathan

ఈ పాట పఠాన్ మూవీని ఓ రేంజ్ ను మరో లెవెల్ కు పెంచేసిందంటున్నారు నెటిజన్లు. ఇక డిఫరెంట్ బికినీ లుక్స్ లో దీపిక మాయ చేసేసింది. ఇన్నాళ్లూ తాను దాచుకున్న అందాలన్నీ చూపించేసింది. అయితే ఈ గ్లామర్ ట్రీట్ కోసం దీపిక భారీగానే ముడుపు తీసుకుందట. తాను డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ ఇస్తేనే స్కిన్ షోకు రెడీ అందట. ఇప్పటికే దీపిక 10 నుంచి రూ.12 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఈ సినిమాలో ఆమె బికినీ కోసమే మరో మూడు కోట్లు పెంచి మొత్తంగా 15 కోట్ల వరకు పారితోషికం అందుకుందట.

Deepika-Padukone-Pathan
‘బేషరమ్‌ రంగ్‌’ అంటూ సాగే రొమాంటిక్‌ సాంగ్‌ లో స్విమ్మింగ్‌పూల్‌ వద్ద పసుపు రంగు బికినీలో దీపిక పదుకొణె డ్యాన్స్‌ చేస్తుంటే యువత మతిపోతోంది. ఈ పాట యూట్యూబ్‌లో విడుదల చేసిన దగ్గరి నుంచి దీపిక అందాలను, పాట పాడిన వారిని పొగుడుతూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. విశాల్‌-శేఖర్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటను కుమార్‌ రాయగా, శిల్పా రావ్‌, కార్లిసా మాంట్రియా, విశాల్‌, శేఖర్‌లు ఆలపించారు.

Tags: Bollywood movie, Deepika Padukone, Pathan