టీనేజ్​లోనే ప్రేమలో పడ్డ హీరోయిన్స్ వీళ్ళే…!

సినిమా ఇండస్ట్రీలోకి రావాలని చాలా మంది అమ్మాయిలు కలలు కంటూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్​ అవుతారు. అలా ఇండస్ట్రీలోకి వచ్చి కష్టపడుతూ స్టార్​డమ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆఫర్లు వరుస కట్టాక ఇక వారు వారి పర్సనల్ లైఫ్​ని కాస్త పక్కకి పెట్టేస్తారు. ప్రేమ, పెళ్లి గురించి అడిగితే ముందు కెరీర్ అంటూ ఉంటారు.

ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ సంగతి తెలిసిందే కదా.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు.. అందం, ఆఫర్లు ఉన్నన్ని రోజులు కష్టపడాల్సిందే. అయితే కెరీర్​ బిజీలో పడి తమ పర్సనల్​ లైఫ్​లో ప్రేమను చాలా మంది హీరోయిన్లు పక్కనబెట్టేస్తారు. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ప్రేమ గురించి అడిగినా.. మాట్లాడినా.. తమకు కూడా టీనేజ్​లో ఓ చిన్న లవ్​స్టోరీ ఉండేదని చెబుతుంటారు. అలా టీనేజ్​లోనే ప్రేమలో పడ్డ హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం రండి..

Shruti Hasan
Sruti hasan
యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ టాలీవుడ్, కోలీవుడ్​లలో వరుస సినిమాలతో సూపర్ బిజీగా ఉంది. అయితే ఈ క్యూటీ 15 ఏళ్ల వయసులోనే ఓ అబ్బాయిని తెగ ఇష్టపడిందట. ఆ కుర్రాడిపై టీనేజ్​లో ప్రేమ పుట్టిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఈ క్రాక్ బ్యూటీ. ఇక సినిమా ఇండస్ట్రీకి వచ్చాక హీరో సిద్ధార్థ్, ధనుశ్​లతో శ్రుతి ఎఫైర్ నడిపినట్లు పుకార్లు వచ్చాయి అప్పట్లో. ఇక లండన్​కు చెందిన మైఖేల్ కోర్ల్సేతో కొన్నాళ్లు శ్రుతి డేటింగ్ చేసి బ్రేకప్ చెప్పేసింది. ప్రస్తుతం ముంబయిలో డూడుల్ ఆర్టిస్ట్ శాంతన్ హజారికతో లివి ఇన్ రిలేషన్​షిప్​లో ఉంది.

Kiara Advani
Kiara Adavani
బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ ఇంటర్​లోనే ప్రేమలో పడిందట. ఇంటర్మీడియట్​లో తన క్లాస్​మెట్​ని కియారా తెగ ఇష్టపడిందట. ఆ విషయంలో ఇంట్లో తెలిసి పేరెంట్స్ కట్టడి చేశారట. ఎలాగైనా అతడిని కలవాలని కంబైన్ స్టడీ కోసం ఫ్రెండ్ దగ్గరకు వెళ్తున్నానని అబద్దం చెప్పి రహస్యంగా కలిసేదట ఈ బ్యూటీ. ఇక బాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చాక.. తన కోస్టార్ సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్.

Tapsee
Tapsee
సొట్టబుగ్గల చిన్నది.. దిల్లీ డాల్.. తాప్సీ పన్ను కూడా టీనేజ్​లోనే ప్రేమలో పడిందట. 14 ఏళ్ల వయసులో తన ఫస్ట్ లవ్​ మొదలైందని చెప్పిందీ భామ. ప్రస్తుతం బాలీవుడ్​లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాతియాస్ బోయ్​తో లవ్​లో ఉన్నట్లు ముంబయి మీడియా కోడై కూస్తోంది.

Nidhi Agarwal
Nidhi Agarwal
హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా సగటు అమ్మాయిలా ప్రేమలో తొందర పడిందట. అయితే ఈ బ్యూటీ కాస్త అడ్వాన్స్. ఏకంగా 4వ తరగతిలోనే ఒక అబ్బాయిని ఇష్టపడిందట. టాలీవుడ్​, బాలీవుడ్​లలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ కొన్నాళ్లు ఇండియన్ స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్​తో డేటింగ్ చేసినట్లు సమాచారం.

Anasuya
Anasuyaa
ఇక టాలీవుడ్ స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ ప్రేమ మొదలైంది టీనేజ్​లోనే. లవ్ ఎట్ ఫస్ట్​ సైట్ ఈ బ్యూటీది. మొదటి చూపులోనే ప్రేమలో పడిన సుశాంక్​ భరద్వాజ్​నే పెళ్లి చేసుకుంది. వీళ్ల పెళ్లికి పెద్దలను ఒప్పించడానికి ఈ బ్యూటీ పెద్ద యుద్ధమే చేశానని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. చివరికి లవ్ చేసిన వ్యక్తినే పెళ్లి చేసుకుని స్థిరపడింది.

Tags: AnasuyaNidhi Agarwal, Kiara Advani, Shruti Hasan, Tapsee