పాత్ర డిమాండ్ మేరకు సినీ తారలు తమ అవయవ సౌష్ఠవాన్ని మార్చుకోవాలి. ఒకప్పటి తారలకంటే ఇప్పటి కుర్ర హీరోలు, హీరోయిన్లు అందులో చాలా ముందుంటున్నారు. సినిమా కథకు, అందులో తమ పాత్రకు సంబంధించిన అంశాలను ఆకళింపు చేసుకునేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. అవసరమైతే ప్రత్యేకంగా శిక్షణ కూడా పొందుతున్నారు. ఇప్పటికే అలా చాలా మంది వివిధ ప్రయోగాలను చేశారు. హిట్లను అందుకున్నారు. అందులో ముఖ్యంగా దగ్గుబాటి వారసుడు రానా గురించి చెప్పుకోవాల్సింది. ఆది నుంచీ మంచి కథాబలమున్న చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నాడు ఈ యువ కథానాయకుడు. అదే తరుణంలో ఆ కథల్లోని తన పాత్రకు అనుగుణంగా దేహాన్ని మార్చకునేందుకు సిద్ధమవుతుంటాడు. ఇంతకు ముందు కృష్ణం వందేజగద్గురం సినిమా కోసం సిక్స్‌ప్యాక్ బాడీని మెయింటేయిన్ చేశారు. ఆ తరువాత బాహుబలి సినిమాకు అదే రేంజ్‌లో కష్టపడ్డారు. కాస్తా బరువు పెరగడమేగాక, కండలను పెంచాడు. ఇప్పుడు తాజాగా మరోసారి తన దేహాన్ని మార్చకున్నాడు రానా.
రానా ప్రస్తుతం ప్రభు సాల్మన్ దర్శకత్వంలో “హాతి మేరే సాతి సినిమాను చేస్తున్నాడు. తెలుగులో ఇది అరణ్యగా రానున్న విషయం తెలిసింది. ఇక చిత్రంలో రానా అడవి మనిషిలా కనిపించనున్నారు. ఇప్పుడు ఆ పాత్రకు తగ్గట్టుగా తన రూపాన్ని మలుచుకుంటున్నాడు రానా. ఏకంగా సినిమా కోసం దాదాపు 30 కిలోల బరువు తగ్గాడట. అందుకోసం కఠినమైన ఎక్సర్‌సైజుల కూడా చేస్తున్నాడట. సన్నగా నాజుగ్గా మారాడానికి తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడట. ఇదిలా ఉండగా రానా ఈ సినిమా తరువాత గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘హిరణ్యకశ్యప’ సినిమాలో నటించనున్నాడు. దాని తరవాత వేణు ఊడుగులతో ఒక సినిమా చేసేందుకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ రెండూ కాకుండా ఇటీవలే దర్శకుడు మిలింద్రావు డైరెక్షన్‌లో కూడా ఒక సినిమాకు చేసేందుకు అంగీకారం తెలపడం విశేషం.