అక్ర‌మ సంబంధం గుట్టు ర‌ట్ట‌వుతుంద‌నీ..

అక్ర‌మ సంబంధాలు అనేక ఆకృత్యాల‌కు దారి తీస్తున్నాయి. కుటుంబాల‌ను చిన్నాభిన్నం చేస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఘ‌ట‌న అందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది. కోడ‌లు త‌న ప్రియుడితో అక్ర‌మ సంబంధం నెరుపుతుండ‌గా అత్త చూసింది. దీంతో ఎక్క‌డ త‌మ గుట్టుర‌ట్ట‌వుతుందోన‌ని భ‌య‌ప‌డిన ఆ కోడ‌లు ఏకంగా ఆ అత్త‌నే అంత‌మొందించింది. హ‌త్య చేశార‌ని అంద‌రినీ న‌మ్మించేందుకు య‌త్నించినా అస‌లు నిజం వెలుగు చూసింది. దీంతో క‌ట‌క‌టాల పాలైంది. ఈ సంఘ‌ట‌న క‌ర్నాట‌క రాష్ర్టం లో జ‌రిగింది. పోలీసులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. క‌ర్ణాట‌క రాష్ర్టం బ్యాటరాయనపుర గ్రామానికి చెందిన కుమార్, సౌందర్య దంప‌తులు. భ‌ర్త స్థానికంగా ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.

ఇదిలా ఉండ‌గా అదే ప్రాంతానికి చెందిన ఓ విద్యుత్ లైన్‌మెన్ న‌వీన్ త‌ర‌చూ త‌మ‌ల‌పాకుల కోసం కుమార్ త‌ల్లి రాజమ్మ వ‌ద్ద‌కు వ‌చ్చేవాడు. ఈక్ర‌మంలో అత‌నికి ఆమె కోడ‌లు సౌంద‌ర్య‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. ఇటీవ‌ల వారిద్ద‌రూ గ‌దిలో క‌లిసి ఉండ‌గా ఆ దృశ్యాన్ని అత్త రాజ‌మ్మ చూసింది. కోడ‌లు సౌంద‌ర్య‌ను హెచ్చ‌రించింది. కొడుకు కుమార్‌కు విష‌యాన్ని చెప్పి పంచాయ‌తీ పెట్టిస్తాన‌ని హెచ్చ‌రించింది. దీంతో ఆందోళ‌న‌కు గురైన సౌంద‌ర్య వెంట‌నే ప్రియుడు న‌వీన్ తో క‌లిసి రాజ‌మ్మ త‌ల‌పై ఇనుప‌రాడ్‌తో గ‌ట్టిగా కొట్టి హ‌త‌మార్చింది. అనంత‌రం ఏమీ తెలియ‌న‌ట్లు ప‌క్కింటికి వెళ్లింది. న‌వీన్ అక్క‌డి నుంచి జారుకున్నాడు. అనంత‌రం ఒక గంట త‌రువాత ప్లాన్ ప్ర‌కారం తిరిగి ఇంటికి వ‌చ్చి కేక‌లు వేసింది. ఎవ‌రో హ‌త్యచేసిన‌ట్లు బోరున విల‌పించ‌డం మొద‌లుపెట్టింది. విష‌యం తెలుసుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మొద‌ట హ‌త్య‌గానే పోలీసులు ఆ త‌రువాత‌ సౌందర్యపై అనుమానం వ్య‌క్తం చేశారు. దీంతో ఆమెను ఠాణాకు పిలిపించి త‌మ‌దైన శైలీలో విచారించారు. దీంతో సౌంద‌ర్య అస‌లు విష‌యాన్ని ఒప్పుకుంది. పోలీసులు ఆమె, ప్రియుడు న‌వీన్‌పై కేసు న‌మోదు చేసి జైలుకు త‌ర‌లించారు.

Tags: karnataka police beat the mistery, wife illigal afair, women murder