క‌రోనా వ్యాధి వ్యాప్తికి అస‌లు కార‌ణం ఈ జీవినే..?

పంగోలిన్‌.. భూమిపూన జీవ‌జాతుల్లో అంద‌మైన‌.. అరుద‌యిన వాటిల్లో ఒక‌టి. తెలుగులో వీటిని అలుగు అని ప్ర‌ఖ్యాతి పొందాయి. చూడ‌డానికి ముంగీసలా ఉన్నా.. తల నుంచి తోక వరకు పొలుసులుంటాయి. ఆ పొలుసులు ఎంత గట్టిగా ఉంటాయంటే, తుపాకీతో కాల్చిబుల్లెట్ లోపలికి దిగదంటే అతిశ‌యోక్తేమీకాదు. అదీగాక పొలుసుల్లో ఔషధ గుణాలున్నాయన్న నమ్మకం, చైనా, వియత్నాంలో పంగోలిన్ మాంసానికీ డిమాండ్ ఉంది. పంగోలిన్ పొలుసులు క్యాన్సర్‌ను నయం చేయడం మాత్రమే కాదు, మహిళల్లో చనుబాలను పెంచుతాయని వైద్య‌నిపుణులు తెలుపుతున్నారు. అన్ని విశిష్ట‌త‌లున్న త‌రువాత ఇంకేముంది. ఎవ‌రు ఊరుకుంటారు. ఇప్పుడ‌దే పంగోలిన్‌ జాతి మ‌నుగ‌డ‌కు ప్రాణాంత‌కంగా మారింది. పొలుసుల కోసం పంగోలిన్‌లను కొంద‌రు స్మ‌గ్ల‌ర్లు వేటాడుతున్నారు. కనిపిస్తే చాలు చంపి, స్మగ్లింగ్ చేస్తున్నారు. అప్ప‌ట్లో అలా స్మగ్లింగ్ చేస్తున్న 14 టన్నుల పంగోలిన్ పొలుసుల్ని సింగపూర్‌లో పట్టుకున్నారు. వాటి విలువ సుమారు రూ.270 కోట్ల‌ని అధికారులు తెల‌ప‌డం గ‌మ‌నార్హం. ఒక పంగోలిన్‌ను సుమారు రూ.20 వేలకు విక్ర‌యిస్తార‌ని అంచనా. ఇలా ఏటా ప్రపంచవ్యాప్తంగా 57 వేల పంగోలిన్లను చంపుతున్నారని అధికారిక లెక్క‌లు తెలుపుతుండ‌డం శోచ‌నీయం. అందుకే ఆ జాతి అంత‌రించే ద‌శ‌కు చేరుకుంది. ఈ నేప‌థ్యంలోనే పంగోలిన్ జంతువుల్ని చంపొద్దంటూ జాకీచాన్ లాంటివాళ్లు ప్రచారం చేస్తుండటం విశేషం.

ఇదిలా ఉండ‌గా పంగోలిన్ జాతికి మ‌రో విపత్తు వ‌చ్చి ప‌డింది. ఏమిటంటే ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ వ్యాధి వ్యాప్తికి ఆ జీవీనే కార‌ణ‌మ‌ని ప్ర‌చారం సాగుతున్న‌ది. ఆ జంతువ‌ల వ‌ల్లే వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న‌ద‌ని ప‌లువురు సోష‌ల్ మీడియా వేదిక‌గా తెగ పోస్టులు చేస్తున్నారు. అదీగాక ఆ జంతువుల‌ను చంపేయాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తుండ‌డం విశేషం. పాంగోలిన్స్ వల్ల కరోనా వైరస్ వస్తుందా? అన్న అంశంపై పరిశోధకులు ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్ర‌స్తుతం పరిశోధనలు మాత్ర‌మే కొనసాగుతున్నాయి. కానీ ఇప్ప‌టికే కొంద‌రు దానిని ప్ర‌చారం చేస్తున్నారు. దీనిపై ప‌లువురు భిన్నంగా స్పందిస్తున్నారు. పంగోలిన్ల‌ను ప్ర‌జ‌ల చేత‌నే చంపేందుకు వేటగాళ్లు ఇలాంటి ఎత్తుగడ వేశార‌ని వారు ఆరోపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. కొవిడ్ 19 – Covid 2019 వైరస్ సోకడానికి కారణమే అనే ప్రచారం చేస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. మ‌రి ఇందులో వాస్త‌మేంతో తెలియాలంటే మ‌రికొంత కాలం ఆగాల్సిందే.

Tags: cancer medicins, china, corona virus, pangolin, viatnam