సుమ‌న్ – చిరంజీవి మ‌ధ్య గొడ‌వ‌కు ఆ హీరోయినే కార‌ణ‌మా…!

టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో సుమన్ చెన్నైలో ఉంటూ తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దాదాపు 40 సినిమాలకు పైగా నటించారు. ఆయన ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో దాదాపు ఆయన నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్లు కావడంతో వరుస విజయాలతో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగాడు సుమన్. అప్పట్లోనే సినిమాకు స్టార్ హీరోల‌ను మించిన రెమ్యున‌రేష‌న్ తీసుకునేవాడంటే సుమన్ క్రేజ్ అప్పట్లో ఎలా ? ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు.

Princess Waiting For The Prince | Agni Gundam Telugu Movie | Chiranjeevi |  Sumalatha - YouTube

సుమన్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇలా దాదాపు 5 భాషల్లో నటించాడు. సుమన్ కెరియర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో సుమన్ ఫ్రెండ్ దివాకర్ రెడ్డి కారణంగా ఆయన బ్లూఫిలిమ్స్ కేసులో ఇరుక్కుని కొంతకాలం జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జైలుకు వెళ్లే టైంలో సుమన్ దాదాపు 24 సినిమాలకు సైన్ చేసి ఉన్నారట. జైలు నుంచి వచ్చిన తర్వాత ఏ డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ గానీ సుమ‌న్‌తో సినిమాలు చేయడానికి ఇష్టపడకపోవడంతో అతనికి సినిమా ఛాన్సులు తగ్గిపోయాయి.

At Dasari Film Awards, Actor Suman Talks About Discipline In Telugu Cinema

అప్పట్లో సుమన్ ఈ కేసులో ఇరుక్కోవడానికి కారణం చిరంజీవి, రజనీకాంత్ అంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. సుమన్ ఈ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చారు. సుమన్ జైలుకు వెళ్లడానికి చిరంజీవికి ఎటువంటి సంబంధం లేదట. అప్పట్లో సుమన్ కి చిరంజీవికి మధ్య కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి. సుమన్ కి చిరంజీవికి మధ్య గొడవలు రావడానికి కారణం అప్పట్లో సుమన్ రెమ్యూనరేషన్ చిరంజీవి రెమ్యూనిరేషన్ కంటే చాలా ఎక్కువగా ఉండడం అన్న పుకార్లూ బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

Actress Sumalatha tests Covid positive, coronavirus

దానితోపాటు అప్పట్లో సుమన్ హీరోయిన్ సుమలతతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారట. ఈ కారణం చేత కూడా సుమన్ చిరంజీవి మధ్యన కొన్ని గొడవలు జరిగాయని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం సుమన్ తన వయసుకు తగ్గ క్యారెక్టర్ లను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. చిరంజీవి ఇప్పటికీ స్టార్ హీరోగా ఎంత ఫామ్ లో ఉన్నాడో అందరికీ తెలుసు. ప్రస్తుతం చిరంజీవి భోళాశంకర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.