నిహారికకు కొత్త లైఫ్ ఇస్తున్న అల్లు అర్జున్.. దెబ్బకు దశ తిరిగి పోవాల్సిందే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నడు. అల్లు అర్జున్ గతఏడాది పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా ప్రపంచానికి పరిచయమైన సంగతి అందరికీ తెలిసిందే. సౌత్ లో మాత్రమే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ కి పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియ లెవ‌ల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

పుష్ప-2లో నిహారిక.. ఆ పాత్రలో మెగాడాటర్‌ – TV9 Telugu | Niharika Konidela  Playing A Role With Allu Arjun Pushpa 2

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలన‌ రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప‌కు సీక్వెల్ గా పుష్ప ద రోల్ అనే సినిమాలో నటిస్తున్నారు. రెడ్ శాండిల్స్‌ స్మ‌గ్లర్ గా పుష్ప సినిమా ద్వారా పరిచయమైన అల్లు అర్జున్ రూలర్‌గా ఎలా ? మారుతాడో ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు అంటూ చాలామంది యాక్టర్స్ పేర్లు వినిపిస్తున్నాయి.

Pushpa 2: వేట మొదలుపెట్టిన పుష్ప 2..!

ఇటీవల పుష్ప 2 సినిమాలో నిహారిక నటించబోతుందంటూ కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. మెగా డాటర్ నిహారిక ఈ సినిమాలో ఒక గిరిజన యువతిగా నటించబోతుందట. ఈ సినిమాలో ఎన్నో స్టంట్స్ నిహారిక చేయబోతుందట‌.. నిహారిక – అల్లు అర్జున్ పక్కనే ఉంటూనే పోలీసులకు పుష్పకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటుందట‌. ఈ సినిమాలో పోలీస్ ఇన్ ఫార్మర్ గా నిహారిక నటిస్తుందని పుష్ప‌ను ప్రూఫ్స్ తో సహా పట్టుకోవడానికి గిరిజన అమ్మాయిగా మారువేషం వేసుకొని పుష్ప‌ వెంటే ఉంటుందట‌.

Niharika Konidela, allu arjun - Gethu Cinema

పుష్ప సమాచారం అంతా పోలీసులకు తెలియజేస్తుందని.. ఈ విషయం రివీల్ అవడమే సినిమాలో ఉన్న గొప్ప ట్విస్ట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు విన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిహారికకు బ‌న్ని మళ్లీ మంచి లైఫ్ ఇవ్వబోతున్నాడు అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాతో తను మళ్ళీ ఇండస్ట్రీలో అడుగుపెడితే త‌న‌కు మంచి క్రేజ్ రావ‌డం కాయం.