టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురును చూశారా.. అందంలో అమ్మ‌ను మించిపోయిందిగా…!

తెలుగు అమ్మాయి అయిన‌ రంభ దాదాపు మూడు దశాబ్దాల క్రితం తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. రంభ స్వస్థలం ఏపీలోని విజయవాడ. ఆమె అసలు పేరు విజయలక్ష్మి. సినిమాలోకి వచ్చాక ఆమె పేరును రంభగా మార్చారు. ఒకప్పుడు తెలుగు తెరపై టాప్ హీరోయిన్గా దుమ్ము దులిపేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, బెంగాలీ భాషలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్గా ఎదిగింది.

తెలుగులో రాజేంద్రప్రసాద్ ఆ ఒక్కటి అడక్కు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రంభ తక్కువ సమయంలోనే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు అందరితో కలిసి నటించింది. ఆ తర్వాత భోజపురి భాషలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె అక్కడ కూడా ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా నీరాజనాలు అందుకుంది. 2010లో రంభ‌ కెనడాకు చెందిన పారిశ్రామికవేత్త ఇంద్ర కుమార్‌ను పెళ్లి చేసుకుని సినిమాలుకు గుడ్ బై చెప్పింది.

Rambha's divorce issue is a closed chapter now - IBTimes India

ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. రంభ సినిమాలకు దూరమైనా సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు అభిమానులకు టచ్ లో ఉంటుంది. తాజాగా తన పెద్ద కుమార్తె లాన్య ఇంద్ర కుమార్ ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. లాన్య‌ అచ్చ తెలుగు ఆడపిల్లగా ముస్తాబైన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నెటిజ‌న్లు అచ్చం నీలాగే ఉంది.. స్కూల్ డేస్ లో రంభ ఎలా ? ఉంటుందో అలాగే ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అటు అందంలోనూ రంభ‌ను మించిపోయి ఉంది.. ఇంకా చెప్పాలంటే లాన్య ఫేస్ అచ్చు గుద్దినట్టు తల్లి పోలికతోనే ఉంది.. లాన్య ఫోటోలపై మీరు కూడా ఒక లుక్ వేయండి.