ఉత్తరాది రాష్ర్టాల్లో ప్రతి రోజు కనీసం ఒకపైటయినా చపాతి తింటే.. తెలుగు రాష్ర్టాల్లో చపాతి తినడం మాత్రం అరుదు. వారంలో ఒక రోజో.. లేదా ఏదయిన పండగకో.. పబ్బానికో చేసుకుంటుంటారు. అదీగాకపోతే ఏ రోగం బారినప్పుడో తింటుంటారు. కానీ చపాతి తినడం వల్ల కలిగి ప్రయోజనాలు తెలిస్తే అందరూ నోరెళ్లబెట్టక తప్పదు. ఆరోగ్యానికి అవి చేసే మేలేమిటో తెలుసుకుంటే ఇకపై రోజూ చపాతిలనే తింటారు. మరి చపాతిలను తినడం వల్ల కలిగే లాభాలేమిటో తెలుసుకోండి..
సాధారణంగా రాత్రి పూట భోజనం చేసిన వెంటనే పడుకోవద్దని, కనీసం గంట తర్వాత బెడ్ ఎక్కాలని డాక్టర్లు సూచిస్తుంటారు. ఎందుకంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయనీ, బరువు పెరిగిపోతారని, దీంతో చాలా మంది కంగరు పడుతుంటారు. కానీ రాత్రివేళ అన్నం బదులు చపాతీలు తింటే మేలని డాక్టర్లు సలహాలు ఇస్తున్నారు. దాని వల్ల అనేక లాభాలున్నాయని వివరిస్తున్నారు. అందులోనూ ఎంత ఎక్కువ సేపు నిల్వ ఉన్నచపాతిలు తింటే అంత ఎక్కువ ఆరోగ్యమని తెలుపుతున్నారు. ఎందుకంటే అవి వేగంగా నెమ్మదిగా జీర్ణం అవుతాయని, తద్వార రక్తంలో చక్కర లెవెల్స్ ఒక్కసారిగా పెరగవని వివరిస్తున్నారు. దానికి తోడు… రాత్రివేళ జీర్ణక్రియా వ్యవస్థ నెమ్మదిగా సాగుతుందని, అందుకు చపాతీలు తినడమే శ్రేయస్కరని సూచిస్తున్నారు. చపాతీల్లో కొవ్వు పదార్థాలు ఉండవు. పైగా గోధుమల్లో ఐరన్ ఎక్కువ కాబట్టి హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. అది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా ఫైబర్ కూడా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నిరోధిస్తుంది. ఉదయం ఫ్రీ మోషన్‌కు దోహదపడుతుంది.
బరువు తగ్గాలనుకునేవారు తక్కువ నూనెతో కాల్చుకోని, లేదంటే అసలు నూనె వెయ్యకుండా కూడా చేసుకోని తినాలని తెలుపుతున్నారు. అన్నం కంటే చపాతీ ఎక్కువ శక్తినిస్తుందనడం విశేషం. అంతేకాదండోయ్ చపాతిలను కూడా మితంగా అదీ రెండు లేదా మూడు మాత్రమే తినాలని వైద్యులు తెలుపుతున్నారు. భోజనం చేశాక ఎలాగైతే ఓ గంటన్నర తర్వాత నిద్రపోతారో చపాతీలు తిన్న తర్వాత కూడా అలాగే నిద్రకు ఉపక్రమించాలని, రాత్రి 7 తర్వాత 10 లోపే చపాతిలు తినాలని, అది ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు.